kumaram bheem asifabad-రైతులు ‘గాలికుంటు’ టీకా వేయించాలి
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:14 PM
పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. తిర్యాణి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో పశువులకు టీకాలు వేయాలని సూచించారు.
తిర్యాణి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రైతులు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. తిర్యాణి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో పశువులకు టీకాలు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా 474 పశువులకు టీకాలు వేశారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ యువ ప్రొఫెషనల్ అధికారి ఆష్మాశర్మ, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, ఎంపీడీవో మల్లేష్, ఉప సర్పంచ్ మల్లేష్, చైనికుమార్, పశువైద్యాధికారి సాగర్, సిబ్బంది మనోహర్, సురేష్, మనోహర్, రాకేష్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించాలి
జిల్లాలో 9 నుంచి 14 సంవత్సరాల లోపు గల బాలికలకు ప్రతి ఒక్కరికి హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. మండల కేంద్రంలోని చింతపల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను నీతి ఆయోగ్ కేంద్ర ప్రతినిధి ఆష్మా శర్మతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, రోగుల వార్డులు, మందుల నిలువల గది, ప్రసూతి పట్టికను పరిశీలించి నెలలో జరుగుతున్న ప్రసవాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి చికిత్స కొరకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే వారికి శుద్ధజలం అందించే ఆర్‌వో ప్లాంట్‌ను వెంటనే మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకు రావాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరా లలోపు బాలిక లకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించాలని చెప్పారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా గర్భా శయ క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా నిరోధించవచ్చని తెలిపారు. అనంతరం విజయ నగరం కాలనీలో నిర్మిస్తున్న జంగుబాయి మండల సమాఖ్య భవన నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆమె వెంట గిరిజన సంక్షేమా ధికారిణి రమాదేవి, ఎంపీడీవో మల్లేష్, ఏపీఎం శ్రీనివాస్, వైద్య సిబ్బంది, సంపూర్ణత అభియాన్ జిల్లా సమన్వయకర్త బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.
పగలు వీధి లైట్లు వెలగకుండా నియంత్రించాలి
ఆసిఫాబాద్‌రూరల్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో పగటి పూట విద్యుత్ దీపాలు వెలగకుండా నియంత్రించాలని కలెక్టర్ హరిత అన్నారు. మండలంలోని చిర్రకుంట, పాడిబండ గ్రామ పంచాయతీలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. పగటిపూట వీధి దీపాలు వెలుగుతుండడాన్ని గమనించారు. స్థానిక పంచాయతీ కార్యదర్శిని పిలిచి వీధి దీపాలు వెలుగుతుండడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే విద్యుత్ తీగల మరమ్మతులు చేపట్టి నియంత్రణ బోర్డులు బిగించాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్‌కు ఫోన్ ద్వారా జిల్లాలోని గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో పగటిపూట విద్యుత్ దీపాలు వెలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమాచారాన్ని సర్పంచ్‌లు, కార్యదర్శులకు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని పారిశుధ్యంపై శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.