రైతులు నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి
ABN , Publish Date - Nov 25 , 2026 | 11:44 PM
గ్రామం లో ఐదెకరాలలోపు భూమి క లిగిన సన్నకారు రైతులు వీబీ జీ రాంజీ పథకంలో భాగంగా వ్యవసాయ కుంట లు ఏర్పాటు చేసుకోవాలని ఎంపీడీవో కృష్ణయ్య అన్నా రు.
- ఎంపీడీవో కృష్ణయ్య
తిమ్మాజిపేట, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : గ్రామం లో ఐదెకరాలలోపు భూమి క లిగిన సన్నకారు రైతులు వీబీ జీ రాంజీ పథకంలో భాగంగా వ్యవసాయ కుంట లు ఏర్పాటు చేసుకోవాలని ఎంపీడీవో కృష్ణయ్య అన్నా రు. మండల పరిధిలోని ఇ ప్పలపల్లి గ్రామంలోని బాప నికుంట చెరువు దగ్గర కొన సాగుతున్న వ్యవసాయ కుం టల పనులను సర్పంచ్ శ్యాంసుందర్, అధికా రులతో కలిసి ఎంపీడీవో పరిశీలించారు. రైతు లు, కూలీలతో మాట్లాడారు. కొలతల ప్రకారం పనులు చేయా లని, ఉదయం 8గంటల వరకే పనికి రావాలని, మొదటి, రెండవ ఫొటో అటెం డెన్స్ వేయాలని, జాబ్‌కార్డు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, అర్హులైన వితంతువులు, ఎన్‌ఎఫ్‌బీఎస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో తెలిపారు. వ్యవసాయ కుంటలు ఏ ర్పాటు చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజ నాలను రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నందున వ్య వసాయ కుంటలు ఏర్పాటు చేసుకోవడం ద్వా రా భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. అనంతరం గ్రామంలోని పాఠశాలను సందర్శిం చి మధ్యాహ్న భోజన రికార్డులను పరిశీలిం చారు. మెనూ ప్రకారం భోజనం అదించాలన్నా రు. ఏపీవో సత్యనారాయణ, ఎంపీవో రాములు నాయక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఏ జిలాని, పంచా యతీ కార్యదర్శి మినాజ్ పాషా, సిబ్బంది తయ్యబ్ పాల్గొన్నారు.