Share News

kumaram bheem asifabad- రైతులు చిరు ధాన్యాలు సాగు చేయాలి

ABN , Publish Date - Jun 24 , 2026 | 10:28 PM

రైతులు చిరు ధాన్యాలు సాగు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం సర్పంచ్‌ కొడప ప్రకాష్‌ అధ్యక్షతన నూతన మార్కెట్‌ కమిటీ కార్యాలయాన్ని కలెక్టర్‌ కె హరిత, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు ముఖ్య ఆతిథిలుగా పాల్గొని ప్రారంభించారు. ఆనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడారు.

kumaram bheem asifabad- రైతులు చిరు ధాన్యాలు సాగు చేయాలి
: మార్కెట్‌ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ హరిత ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు

జైనూర్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రైతులు చిరు ధాన్యాలు సాగు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం సర్పంచ్‌ కొడప ప్రకాష్‌ అధ్యక్షతన నూతన మార్కెట్‌ కమిటీ కార్యాలయాన్ని కలెక్టర్‌ కె హరిత, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు ముఖ్య ఆతిథిలుగా పాల్గొని ప్రారంభించారు. ఆనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, ఉట్నూర్‌ మండలాల రైతులకు నూతనంగా నిర్మించిన మార్కెట్‌ కార్యాలయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా రైతులు చిరు ధాన్యాల సాగుపై దృష్టి సారించాలన్నారు. మార్కెట్‌ కమిటీ ద్వారా రైతులకు మేలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుటూ జైనూర్‌ మార్కెట్‌ కమిటీ అభివృధ్ధి కోసం నిధులు కేటాయిస్తామన్నారు. ఈ ప్రాంతంలో జొన్నలు పండిచిన రైతుల నుంచి యార్డులో బినామిల పేరట కొనుగోలు చేస్తున్నారని తెలిసిందని చెప్పారు. అధికారులు రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు. రెతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుకు సంబంధించిన రశీదులు, విత్తనాల ప్యాకెట్లు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో పంటలు దిగుబడి ఇవ్వని ఏడల సంంధిత డీలరుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. కాని చాల మంది రైతులు ఖాళీ చేసిన విత్తనాల ప్యాకెట్లు, రశీదులు సక్రమంగా ఉంచుకోవడం లేదని చెప్పారు. దీంతో రైతులకు అత్యవసర సమయంలో మేలు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతకు ముందు కలెక్టర్‌ కె. హరిత స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని సిబ్బందిని కోరారు. ఓటరు జాబితా సవరణ పార దర్శకంగా నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా ఏజెన్సీలో పోడు భుములు సాగు చేస్తున్న ఎస్సీ రైతులకు కనీసం పహాని పత్రాలు జారీ చేయాలన్నారు. బ్యాంక్‌ ద్వార రుణాలు అందేలా చూడాలని ఏజేన్సీ ఎస్సీ కులాల ఐక్య కార్యాచరణ సమితి జిల్లా నాయకులు మవాలె దత్త, దవనె ప్రకాష్‌ ఎమ్మెల్యేలకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్లు కుడిమెత విశ్వనాథ్‌రావ్‌, కాంబ్లే అనిల్‌, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సగుణ, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ జైవంత్‌రావ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, జిల్లా వ్యవసాయ అధికారి జాడి వెంకట్‌, తహసీల్దార్‌ ఆడ బీర్షావ్‌, ఎంపీడీవో సుధాకర్‌ రెడ్డి, మార్కెట్‌ కార్యదర్శి ఈర్ఫాన్‌ అహ్మద్‌, ఆర్‌ఐ మోహన్‌, సిబ్బంది వైస్‌ ఎంపీపీలు చిర్లే లక్ష్మణ్‌, షేక్‌ రషీద్‌, సర్పంచులు తొడసం రాజేందర్‌, కుంర యశోద, రాథోడ్‌ రాందాస్‌, ఉయిక చందన్‌షావ్‌, మడావి కౌసల్యాబాయి భీంరావ్‌, మడావి నాగోరావ్‌. జాదవ్‌ శ్రావణ్‌ , జాఽధవ్‌ భావరావ్‌, కుంర దేవశావ్‌, పార్టీ మండల అధ్యక్షుడు ఇంతీయాజ్‌ లాల, కాంగ్రేస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ అబ్దుల్‌ ముకీద్‌, జల్లా నాయకులు పెందుర్‌ ప్రభాకర్‌, రహీంఖాన్‌, షేక్‌ అబ్బు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 10:28 PM