Share News

kumaram bheem asifabad- ఆయిల్‌ పామ్‌ సాగుకు రైతులు ముందుకు రావాలి

ABN , Publish Date - May 05 , 2026 | 10:23 PM

జిల్లాలోని ఆయిల్‌ పామ్‌ సాగు కోసం అర్హులైన రైతులు ముందుకు రావాలని ఆ దిశగా అధికారులు వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సమీతకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం రైతు వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆసిఫాబాద్‌ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు.

kumaram bheem asifabad- ఆయిల్‌ పామ్‌ సాగుకు రైతులు ముందుకు రావాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆయిల్‌ పామ్‌ సాగు కోసం అర్హులైన రైతులు ముందుకు రావాలని ఆ దిశగా అధికారులు వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సమీతకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం రైతు వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆసిఫాబాద్‌ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. సాగు నీరు సౌకర్యం కలిగిన రైతులు ఆయిల్‌ పామ్‌ సాగుకు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుందని తెలిపారు. ఆయిల్‌ పావ్‌ సాగులో మొదటి నాలుగు సంవత్సరాలు అంతర్‌ పంటలను సాగు చేసుకోవచ్చన్నారు. ఆయిల్‌ పామ్‌ సాగు ద్వారా రైతులు అధిక లాబాలను ఆర్జించవచ్చన్నారు. ఆయిల్‌ పామ్‌ పంటకు చీడ పురుగులు, పశువులు, కోతుల బెడద ఉండదన్నారు. సంప్రదాయ పంటలైన పత్తి, వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. కూరగాయల పంటలను సాగు చేసి అధిక లాభాలను ఆర్జించవచ్చన్నారు. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నామని అదే ఆయిల్‌ పామ్‌ సాగు పెరిగితే ఇక్కడే వంట నూనెలు చౌకగా దొరుకుతాయన్నారు. ప్రతి ఒక్క రైతు తమ కుటుంబానికి సరిపడే పంటలను కూరగాయలను పండించుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య బారిన పడే అవకాశం ఉందన్నారు. రైతులు అధిక సంఖ్యలో ఆయిల్‌ పామ్‌ సాగుకు ముందుకు రావాలన్నారు. అధికారులు, సలహాలు, సూచనలను పరిగనలోనికి తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అనిల్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు మంగ, విశ్వనాథ్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నదీం, జిల్లా వ్యవసాయ శాఖాధికారి వెంకటితో పాటు సిబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2026 | 10:23 PM