Share News

రైతులకు సాగునీరందించాలి

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:37 PM

కాళేశ్వరం ప్రాజెక్టు లో పంపులు నడిపి రైతులకు సాగు, తాగునీరు అందించాలని బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం డి మాండ్‌ చేస్తే, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల రక్తం చల్లితే పంటలు పండుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చే యడాన్ని నిరసిస్తూ జిల్లాలో బీఆర్‌ఎస్‌ నాయ కులు నిరసనలు చేపట్టారు.

రైతులకు సాగునీరందించాలి
తిమ్మాజిపేట పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ నాయకుల నిరసన

- బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు

- అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు

కల్వకుర్తి/ తిమ్మాజిపే ట/ కోడేరు/ బిజినేపల్లి/ వెల్దండ/ తెలకపల్లి, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : కాళేశ్వరం ప్రాజెక్టు లో పంపులు నడిపి రైతులకు సాగు, తాగునీరు అందించాలని బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం డి మాండ్‌ చేస్తే, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల రక్తం చల్లితే పంటలు పండుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చే యడాన్ని నిరసిస్తూ జిల్లాలో బీఆర్‌ఎస్‌ నాయ కులు నిరసనలు చేపట్టారు. బీఎన్‌ఎస్‌-2023 చట్టం కింద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎఫ్‌ఐ ఆర్‌ నమోదు చేయాలని కోరుతూ పలు పోలీస్‌ స్టేషన్లలో పోలీసులకు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.

ఫ తిమ్మాజిపేటలో బీఆర్‌ఎస్‌ పార్టీ మం డల శాఖ అధ్యక్షుడు జోగు ప్రదీప్‌ ఆధ్వర్యంలో తిమ్మాజిపేటలో ర్యాలీ నిర్వహించారు. ప్రదీప్‌ మాట్లాడుతూ పంటలకు నీరందించకపోతే రై తులు తిరగబడతారని, ప్రభుత్వం తీరు మా ర్చుకోవాలని కోరారు.

ఫ కల్వకుర్తిలో బీఆర్‌ఎస్‌ యువజన విభా గం మండల అధ్యక్షుడు వట్టెపు కిశోర్‌, పట్టణ అధ్యక్షుడు ప్రదీప్‌ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సీఎం రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు.

ఫ కోడేరులో బీఆర్‌ఎస్‌ నాయకులు కోడేరు గ్రామ ఉప సర్పంచు కొమిరె మాసయ్య, బీఆర్‌ ఎస్‌ గ్రామ పార్టీ అధ్యక్షుడు డ్యాగ శ్రీశైలం, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరుతూ కోడేరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫ బిజినేపల్లిలో బీఆర్‌ఎస్‌ నాయకులు పో లీసులకు ఫిర్యాదు చేశారు. విద్వేషాలు, హిం సను ప్రేరిపించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మండల కేంద్రంలో పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫ వెల్దండలో మాజీ ఎంపీపీ, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పుట్టరాంరెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజితారెడ్డి, సర్పంచ్‌ కొండల్‌ యాదవ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ నాగులు నాయక్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫ తెలకపల్లిలో గ్రంథాలయ మాజీ చైర్మన్‌ మాధవరం హనుమంతరావు అధ్యక్షతన సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపైనే వెంటనే సుమోటోగా స్వీ కరించి క్రిమినల్‌ కేసు నమోదు చేసి చట్టప రంగా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 14 , 2026 | 11:37 PM