Share News

రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరివ్వాలి

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:22 PM

రైతులు సాగు చేస్తున్న యాసం గి పంటకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వా లని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి డిమాండ్‌ చేసారు.

రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరివ్వాలి

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి

లక్షెట్టిపేట, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రైతులు సాగు చేస్తున్న యాసం గి పంటకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వా లని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి డిమాండ్‌ చేసారు. మంగళవారం ఆయన బీజేపీ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్‌ మండలాల రైతులతో కలిసి లక్షెట్టిపేట ఊత్కూర్‌ చౌరస్తాలో రాస్తారోకో చే సారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి పంట కోసం రై తులు నారు పోసి ఇప్పటికి 50రోజులు కావస్తుందని ఇప్పటికి గూడెం లిఫ్టు నుంచినీరు ఇవ్వకపోవడంతో నారు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. సమాచారం అందుకున్న ఇరిగేషన్‌ డీఈ ఈనెల 16లోగా పూర్తి స్థాయిలో నీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎనగందుల కృష్ణమూర్తి, వీరమల్ల హ రిగోపాల్‌రావు, గోపతి రాజయ్య, బందెల రవిగౌడ్‌, స్వామిరెడ్డి, బొప్పు కిషన్‌, సంతోష్‌, అశ్విన్‌, సత్తయ్య, సురేష్‌, సతీష్‌, లచ్చన్న, కిషన్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 11:22 PM