Share News

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

ABN , Publish Date - May 05 , 2026 | 12:57 AM

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యంను రైస్‌మిల్లులో వేగంగా అన్‌లోడ్‌ చేయడంతో పాటు హమాలీలు, లారీల సంఖ్యను పెంచుకోవాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో

 రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

సిరిసిల్ల అర్బన్‌, మే 4 (ఆంఽధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యంను రైస్‌మిల్లులో వేగంగా అన్‌లోడ్‌ చేయడంతో పాటు హమాలీలు, లారీల సంఖ్యను పెంచుకోవాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి యాసంగి సీజన్‌లో ఽధాన్యం కొనుగోలు రవాణా తదితర అంశాలపై జిల్లా పౌరసరఫరాల అధికారులు, రైస్‌ మిల్లలు యాజమానులు, ట్రాన్స్‌ఫోర్ట్‌ కాంట్రాక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్‌లైన్‌ ఎంట్రీ తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైస్‌ మిల్లర్లు హమాలీల సంఖ్య వెంటనే పెంచాలని, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని వేగంగా అన్‌ లోడింగ్‌ చేయించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆన్‌లైన్‌ ఎంట్రీని పూర్తి చేయాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ అధికారులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించిన రైతుల ఖాతాల్లో డబ్బులు వేగంగా జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, వెంట వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లారీల ట్రాన్స్‌ పోర్ట్‌లు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి అనుగుణంగా వాహనాలను సమకూర్చాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలను ఎపఁటికపుఁడు పరిశీ లించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ గీత, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎల్‌ బుచ్చిబాబు, మేనేజర్‌ నరసింహ, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

ఫ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్రపౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌గౌడ్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, అడ్లూరి లక్ష్మన్‌ కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావులతో కలిసి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో సమీక్షించారు. జిల్లాలో ధాన్యం కొను గోళ్లు ఎలా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని అడిగి తెలుసుకున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రాలను గ్రామ స్థాయి, మండలస్థాయి అధికారులు నిత్యం పరిశీలించాలని ఆదేశించారు. ఈ నెల చివరి వరకు వంద శాతం ఽపూర్తి చేయాలన్నారు.

Updated Date - May 05 , 2026 | 12:57 AM