జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో
ABN , Publish Date - May 25 , 2026 | 10:55 PM
ధాన్యం కొనుగో లు కేంద్రాల్లో కొనుగోళ్లలో జాప్యం చేయడాన్ని నిరసి స్తూ రైతులు సోమవారం భీమారం మండల కేంద్రం లోని జాతీయ రహదారి ఆరేపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద ధర్నా నిర్వహించారు.
-ధాన్యం త్వరగా కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం
భీమారం, మే 25 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగో లు కేంద్రాల్లో కొనుగోళ్లలో జాప్యం చేయడాన్ని నిరసి స్తూ రైతులు సోమవారం భీమారం మండల కేంద్రం లోని జాతీయ రహదారి ఆరేపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యంను కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే రోజుల తరబడి కొనుగోలు చే యడం లేదని, మండలంలోని మూడు కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేశారని కానీ ధాన్యం సకాలంలో కాంటా వేయడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాలకు లా రీలు కూడా సక్రమంగా రావడం లేదని పేర్కొన్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొ న్నారు. అధికారులు, నిర్వహకులు మిల్లర్లు కుమ్మక్కై ఒక బస్తాకు 5 కిలోల ధాన్యాన్ని కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఎండలో ఇబ్బందులు పడుతున్నామ న్నారు. నీడ, నీరు లేదని, గన్ని సంచులు, టార్పాలిన్‌లు అందుబాటులో లేవన్నారు. ఇంత జరుగుతున్నా అధికా రులు స్పందించడం లేదన్నారు. అలాగే మండల కేంద్రంలో ప్రభుత్వ గోదాములు ఉన్నాయని, మండలం లోని ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తుండడంతో ఇత ర మండలాలకు చెందిన ధాన్యాన్ని నిల్వ చేస్తున్నార న్నారు. రైతుల ధర్నాకు బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు పలికి ధర్నాలో కూర్చున్నారు. కొనుగోలు కేంద్రాల్లోని స మస్యలను, రైతుల బాధలను మంత్రి పట్టించు కోవ డం లేదని పేర్కొన్నారు. స్థానిక ఎస్‌ఐ రాజేందర్ ధర్నా వద్దకు చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి సమ స్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, రైతులు సంయమనం పాటించాలని సూచించారు. దీంతో శాం తించిన రైతులు రాస్తారోకో విరమించారు. రైతులతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు శ్రీకాంత్, రాజ్‌కుమార్, ఫ్రణీత్, రాము, లచ్చన్న పాల్గొన్నారు.