ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతుల నిరసన
ABN , Publish Date - May 15 , 2026 | 12:54 AM
ధాన్యం కొను గోళ్లను వేగవంతం చేయాలని కోరుతూ చొప్పదండిలో రైతులు రాస్తారోకో చేశారు. వ్యవసాయ మార్కెట్‌లోని కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచుల కొరత ఏర్పడిందని ఇతర ప్రాంతాలకు గన్నీ సంచు లను తరలిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశా రు. 15 రోజులుగా
చొప్పదండి, మే 14 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొను గోళ్లను వేగవంతం చేయాలని కోరుతూ చొప్పదండిలో రైతులు రాస్తారోకో చేశారు. వ్యవసాయ మార్కెట్‌లోని కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచుల కొరత ఏర్పడిందని ఇతర ప్రాంతాలకు గన్నీ సంచు లను తరలిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశా రు. 15 రోజులుగా ధాన్యం కొనుగోల్లు సాఫీగా సాగడం లేదని, వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయా లని డిమాండ్ చేశారు. మార్కెట్ చైర్మన్ కొత్తూరు మహేష్, ప్యాక్స్ సీఈవో తిరుపతిరెడ్డిలు రైతుల వద్దకు వెళ్లి కొనుగోళ్లను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి రాస్తారోకో విరమిం చారు. ప్యాక్స్ డైరెక్టర్ ఆనంద్‌రెడ్డి, నాయకులు సునీ ల్, జహీర్, శ్రావణ్ రైతులకు మద్దతు తెలిపారు.
శంకరపట్నం: తాడికల్ గ్రామంలో రైతులు ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ గురు వారం జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం రైతులు మాట్లాడుతూ తాలు, తేమ పేరుతో మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.