Share News

రైతుల భూములు కంపెనీలకివ్వడం బ్రోకర్ల పని

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:16 AM

రైతుల భూములను లాక్కొని కార్పొరేట్‌ కంపెనీలకు ఇవ్వడం బ్రోకర్లు చేసే పని అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. నిర్వాసితులకు నష్ట పరిహారం...

రైతుల భూములు కంపెనీలకివ్వడం బ్రోకర్ల పని

  • రైతుల ధర్నాలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

రాజేంద్రనగర్‌, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): రైతుల భూములను లాక్కొని కార్పొరేట్‌ కంపెనీలకు ఇవ్వడం బ్రోకర్లు చేసే పని అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. నిర్వాసితులకు నష్ట పరిహారం ఇస్తామనడం భావ్యం కాదన్నారు. మూసీ పక్కన గల రైతుల భూములెందుకు తీసుకుంటున్నారో వారికి సర్కారు చెప్పాలన్నారు. సోమవారం ఈసీ నదీ పరివాహక ప్రాంత రైతులు, వారి కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేయతల పెట్టిన హోటల్‌, మాల్‌లు రైతులే నిర్మించుకుంటారని, వారికి అసాధ్యమైతే రైతులే అమ్ముతారని స్పష్టం చేశారు. ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ రైతుల పోరాటం న్యాయమైనదని తెలిపారు. మధురిడ్జ్‌ పార్కు భవనానికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే అనుమతులిచ్చి.. అదే ప్రభుత్వం కూల్చి వేస్తామనడం సరి కాదన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 05:16 AM