ప్రభుత్వాల విధానాలతో సంక్షోభంలో రైతాంగం
ABN , Publish Date - May 10 , 2026 | 11:21 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతాంగం సంక్షోభంలో పడిందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవాధ్య క్షుడు కోటేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మార్క్స్‌భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
-ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కోటేశ్వర్
మంచిర్యాల కలెక్టరేట్, మే 10 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతాంగం సంక్షోభంలో పడిందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవాధ్య క్షుడు కోటేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మార్క్స్‌భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసా య రంగ వాణిజ్యాన్ని కార్పొరేట్, బహుళ జాతి సంస్థలకు అప్పజెప్పడానికి రైతు చట్టాలను తెచ్చిందన్నారు. పంటలకు కనీస మద్దతు ధర లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీ మా, పంటల బీమా పథకాలను సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. వడ్లు, మక్కలను కోసిన రైతులు వాటిని అమ్మేందుకు కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. జూన్ 15,16 తేదీల్లో మంచిర్యాల పట్టణంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలను నిర్వహి స్తున్నామన్నారు. ఈ సభకు రైతులు, రైతు కూలీలు, ప్రజలు ప్రజాస్వామిక వాదులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి లాల్‌కుమార్, అధ్యక్ష, కార్యదర్శులు బిక్షపతి, వెంకన్న, నాయకులు రాజు, తిరుపతి, ప్రభాకర్, రమేష్, రాజేష్, కిష్టన్న పాల్గొన్నారు.