kumaram bheem asifabad- గోపాలమిత్రల గోడు పట్టదా?
ABN , Publish Date - Oct 16 , 2026 | 10:28 PM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విద్యుత్ కోతలతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పంట చేతికొచ్చే సమయంలో మెరుగైన విద్యుత్ లేక మోటార్లు కాలిపోతున్నాయని, ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నాయని చెప్పారు. పంటలు ఎండిపోవడంతో రైతుల పెట్టుబడి కూడా పొందే అవకాశం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణకు జీవనాడిలాంటి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి, ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లడం దారుణమన్నారు.
ఆసిఫాబాద్రూరల్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విద్యుత్ కోతలతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పంట చేతికొచ్చే సమయంలో మెరుగైన విద్యుత్ లేక మోటార్లు కాలిపోతున్నాయని, ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నాయని చెప్పారు. పంటలు ఎండిపోవడంతో రైతుల పెట్టుబడి కూడా పొందే అవకాశం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణకు జీవనాడిలాంటి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి, ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లడం దారుణమన్నారు. సింగరేణి బొగ్గు ఆగితే రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. విద్యుత్ కోతలు లేకుండా రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్నారు. కాలిపోయిన మోటార్లు, పంట నష్టానికి రైతులకు నష్టపరిహరం చెల్లించాలన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కరెంట్ కోతలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాష్, కౌన్సిలర్లు చిలువేరి వెంకన్న, నాగుబాయి, దూడల లక్ష్మి, బీఆర్ఎస్ నాయకురాలు సరస్వతి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జాబరి రవీందర్, నాయకులు సాయిశ్రావణ్, శ్రీనివాస్, వినోద్, దూడల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
‘కల్యాణలక్ష్మి’ చెక్కులు పంపిణీ
వాంకిడి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 50 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి పంపిణీ చేశారు. ఈ సంద్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలనే లక్ష్యంతో కల్యాణలక్ష్మి పథకం అమలు చేసిన ట్లు పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన తులం బంగారం హామీని నేరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కవిత, పీఏసీఎస్ చైర్మన్ జాబిరే పెంటయ్య, వాంకిడి, సరండి సర్పంచ్లు సతీష్, బాపూజీ, ఉపసర్పంచ్ దీపక్ ముండే, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.