Share News

kumaram bheem asifabad- రైతులకు ‘కాంప్లెక్స్‌’ కష్టాలు

ABN , Publish Date - Aug 02 , 2026 | 10:16 PM

సహకార సంఘాలకు కాంప్లెక్స్‌ ఎరువుల సరఫరా కాకపోవడంతో రైతులు కష్టాలు పడుతున్నారు. మండలంలో సాగు చేస్తున్న పంటలకు అవసరమైన వర్షం పడడంతో రైతులు పంటలకు ఎరువుల అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రసాయనిక ఎరువులు కొనాలంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.

kumaram bheem asifabad- రైతులకు ‘కాంప్లెక్స్‌’ కష్టాలు
లోగో

రెబ్బెన, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘాలకు కాంప్లెక్స్‌ ఎరువుల సరఫరా కాకపోవడంతో రైతులు కష్టాలు పడుతున్నారు. మండలంలో సాగు చేస్తున్న పంటలకు అవసరమైన వర్షం పడడంతో రైతులు పంటలకు ఎరువుల అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రసాయనిక ఎరువులు కొనాలంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ ధరకే ఎరువులను విక్రయించే ప్రాథమిక సహకార సంఘాలకు ఎరువులు సరఫరా కాలేదు. దీంతో రైతులు ఎరువుల దుకాణాలను ఆశ్రయించి వారు చెప్పిన ధరకే కొనుగోలు చేస్తున్నారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో రైతులు అత్యధికంగా పత్తి పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పత్తి నెల రోజుల పంట కావడంతో ఎరువులు వేసే పనిలో పడ్డారు. మండలంలో సుమారు 38 వేల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఇందులో వరి 5,400 ఎకరాలు, కంది 400 ఎకరాలు, 2,100 ఎకరాల వరకు ఇతర పంటలను వేస్తున్నారు. కాగా ప్రభుత్వ ధరలకే ఎరువులు అందించే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి డీఏపీ కాంప్లెక్స్‌ ఎరువులు సరఫరా లేక పోవడంతో రైతులు ఎరువుల దుకాణాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నది.

- యూరియా మాత్రమే..

ప్రస్తుతం సహకార సంఘాలకు ప్రస్తుతం యూరియా మాత్రమే సరఫరా అవుతుంది. దీంతో రైతులకు హమాలీ ఖర్చుతో కలిపి రూ.270కే లభిస్తోంద. అదే డీఏపీ కాంప్లెక్సు ఎరువులను ఫర్టిలైజర్‌ షాపుల్లో కొనుగోలు చేస్తే ప్రభుత్వం నిర్ణయించి ధర కంటే ఒక్కొక్క బస్తాపై అధికంగా రూ.60 నుంచి రూ.100 వరకు చెల్లించాల్సి వస్తోంది. రసాయనిక ఎరువుల ధరలు పెరిగిపోతున్నా యి. గత సీజన్‌లో రూ.1,350 ఉన్న కాంప్లెక్సు ఎరువుల బస్తా ధర ఈ సారి సీజన్‌ ప్రారంభం నాటికే ఏకంగా రూ.2150కి చేరిం ది. అలాగే పోటాష్‌, ఇతర కాంప్లెక్స్‌ ఎరువు లు, డీఏపీ బస్తాల ధరలు భారీగా పెరుగ డంతో రైతులపై ఆర్థిక భారం పడుతంది. అలాగే ప్రయివేటు షాపుల వారు అదనంగా హమాలీ ఖర్చులు వసూలు చేస్తుండడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఇప్ప టికైనా అధికారులు స్పందించి కాంప్లెక్స్‌ ఎరువులను పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇంకా సరఫరా కాలేదు..

- దిలీప్‌కుమార్‌, వ్యవసాయాధికారి

మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసా య సహకార సంఘానికి ఇంకా ఎరువుల సరఫరా కాలేదు. రైతులకు కావాల్సిన డీఏపీ కాంప్లెక్స్‌ ఎరువులను అందించాలని నిర్ణయిం చాం. కానీ డీఏపీ, కాంప్లెక్సు ఎరువులు రావడం లేదు. రెగ్యులర్‌గా యూరియా సరఫరా అవుతుండడంతో రైతులకు అందజే స్తున్నాం. డీఏపీ, కాంప్లెక్సు ఎరువులు సరఫ రా కాగతానే రైతులకు పంపిణీ చేస్తాం.

Updated Date - Aug 02 , 2026 | 10:16 PM