Share News

ఏకపక్ష నిర్ణయాలపై రైతుల ఆగ్రహం

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:43 PM

ఎన్‌హెచ్‌ 63 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రైతుల నుంచి ఎ లాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఏకపక్షంగా కొత్త అలైన్‌మెంట్‌ ఖరారు చేస్తూ గెజిట్‌ విడుదల చేయడంపై హా జీపూర్‌, లక్షెట్టిపేట మండలాల రైతులు తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మండలంలోని దొ నబండ శివారులోని జాతీయ రహదారిపై బైఠాయించి ఆం దోళన చేపట్టారు.

ఏకపక్ష నిర్ణయాలపై రైతుల ఆగ్రహం
రఘునాధ్‌రావు దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న రైతులు

రఘునాథ్‌రావు దిష్టిబొమ్మ దహనం

హాజీపూర్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఎన్‌హెచ్‌ 63 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రైతుల నుంచి ఎ లాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఏకపక్షంగా కొత్త అలైన్‌మెంట్‌ ఖరారు చేస్తూ గెజిట్‌ విడుదల చేయడంపై హా జీపూర్‌, లక్షెట్టిపేట మండలాల రైతులు తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మండలంలోని దొ నబండ శివారులోని జాతీయ రహదారిపై బైఠాయించి ఆం దోళన చేపట్టారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునా థ్‌రావు దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ 63 జాతీయ రహదారికి సంబంధించి 2018లో నో టిఫికేషన్‌ విడుదల కాగా 2023లో గెజిట్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం అలైన్‌మెంట్‌లో మార్పులు చేసేందుకు ప్రయత్నా లు జరిగాయని ఆరోపించారు. రైతుల అభిప్రాయాలు, అను మతులు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అ న్యాయమన్నారు. కొందరి సంతకాలను అనుమతి లేకుండా తీసుకుని నోటీసులు జారీ చేస్తున్నారని అధికారుల తీరుపై అ సహనం వ్యక్తం చేశారు. 2018లో ప్రతిపాదించిన పాత రహ దారి మార్గాన్నే కొనసాగించాలని, ప్రస్తుతం ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రాష్ట్ర మంత్రి వివేక్‌ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సా గర్‌రావు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి నిరసనను విరమింపజేశారు. రహదారి విస్తరణలో భూము లు కోల్పోయి నోటీసులు అందించిన రైతులు జిల్లా కేంద్రంలో ని ఆర్డీవో కార్యాలయంలో 150 మంది రైతులు నోటీసులో పొందుపర్చిన పత్రాలు అందజేయడం కొసమెరుపు. ఎన్‌హె చ్‌ 63 బాధితుల్లో కొందరు తమ భూములు ఇచ్చేందుకు సి ద్ధమై పరిహారం పెంచాలని కోరుతున్నారు.

Updated Date - Nov 18 , 2026 | 11:43 PM