కరెంట్ కోతలపై రైతుల ఆగ్రహం
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:49 AM
విద్యుత్ కోతలు, లోవోల్టేజీ సమస్యలతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ గ్రామానికి చెందిన రైతు లు శుక్రవారం విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో జగిత్యాల-నిజామాబాద్ రహదారిపై
జగిత్యాలరూరల్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ కోతలు, లోవోల్టేజీ సమస్యలతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ గ్రామానికి చెందిన రైతు లు శుక్రవారం విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో జగిత్యాల-నిజామాబాద్ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యుత్ కోతలతో వరి పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తామని విద్యుత్‌శాఖ ఏడీ రైతులకు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు
ఫ కోరుట్ల రూరల్ : విద్యుత్ కోతలు, యాప్‌లో యూరియా నమోదు ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన తెలిపారు. శుక్ర వారం మండలంలోని పైడిమడుగు గ్రామంలోని కోరు ట్ల రాయికల్ రహదారిపై రాస్తారోకో చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల నిరంతర విద్యుత్, వ్యవ సాయానికి 12 గంటల విద్యుత్ సరఫరా చేస్తానని హామీ ఇచ్చి గంట పాటు కూడా విద్యుత్ అందించడం లేదని ఆరోపించారు. యూరియా యాప్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యుత్ ఏఈ వర ప్రసాద్ రైతుల వద్దకు చేరుకు అంతరాయం లేకుండా విద్యుత్ పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఫ రాయికల్: మండలంలోని ఒడ్డెలింగాపూర్ గ్రామం లో విద్యుత్ కొరత తీర్చాలని రైతులు శుక్రవారం సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 24 గంటలు ఇస్తామని చెప్పి కనీసం ఆరు గంటలు కూడా ఇవ్వడం లేదని అన్నారు. విద్యుత్ కొరతతో తమ పంటలు ఎండిపోతున్నాయని, సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యు త్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకుడు తురగ శ్రీధర్ రెడ్డి, నాయకులు ముద్దం నారాయణ, శ్రీకాంత్, దరావత్, శ్రీనివాస్, అనుపురం రవీందర్, సుధాకర్, రమణయ్య, ముంజం చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చింతలూరు గ్రామంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్థులు విద్యుత్ శాఖ ఏఈకి వినతిపత్రం అందజేశారు. గ్రామ సమీపంలోని ఒడ్డెలింగాపూర్ సబ్‌స్టేషన్ నుంచి నేరుగా ఎక్స్‌ప్రెస్ ఫీడర్‌ను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని కోరారు.
ఫ మెట్‌పల్లి రూరల్: మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండి పోతున్నాయంటూ రైతులు ఆందోళన దిగారు. శుక్రవారం గ్రామంలోని ప్రధాన రహదిరిపై, సబ్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. విద్యుత్ అధికారి సంఘ టన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్యను ఉన్న తాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విర మించారు. నిరసన తెలిపిన వారిలో రైతు నాయకుడు చౌటుపల్లి అంజ య్య , ఉపసర్పంచ్ కాసాడి తిరుపతి, దుద్దల తిరు పతి, లక్ష్మీనారాయణ, రైతులు పాల్గొన్నారు.