అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ABN , Publish Date - Feb 28 , 2026 | 03:45 AM
సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ రైతు ప్రాణాలు తీసుకున్నాడు. మెదక్ జిల్లా కౌడిపల్లికి ...
కౌడిపల్లి, ఫిబ్రవరి 27: (ఆంధ్రజ్యోతి): సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ రైతు ప్రాణాలు తీసుకున్నాడు. మెదక్ జిల్లా కౌడిపల్లికి చెం దిన రైతు రెడ్డి శేఖర్ సాగునీటి కోసం భూమిలో రెండు బోర్లు వేయడంతో పాటు కుటుంబ పోషణ, వైద్య ఖర్చులకు రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులు భారంగా మారడంతో శుక్రవారం ఉదయం స్థానిక చెరువు కట్ట సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.