Share News

kumaram bheem asifabad- రైతులకు ‘ఫార్మర్‌ రిజిస్ట్రీ’ తప్పనిసరి

ABN , Publish Date - Oct 04 , 2026 | 10:39 PM

పట్టాదారు రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఫార్మ ర్‌ రిజిస్ట్రేషన్‌లో భాగంగా ప్రఈ రైతు రిజిస్ట్రేషన్‌ /ఫార్మర్‌ ఐడీ సమకూరుస్తున్నారు. ఒక రైతు ‘ఒక గుర్తింపు-సమగ్ర సేవలు‘ లక్ష్యంగా అన్నదాతల వివరాలను డిజిటల్‌గా నమోదు చేస్తున్నారు

kumaram bheem asifabad- రైతులకు ‘ఫార్మర్‌ రిజిస్ట్రీ’ తప్పనిసరి
లోగో

- సాంకేతిక చిక్కులతో తప్పని ఇబ్బందులు

కాగజ్‌నగర్‌ టౌన్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): పట్టాదారు రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఫార్మ ర్‌ రిజిస్ట్రేషన్‌లో భాగంగా ప్రఈ రైతు రిజిస్ట్రేషన్‌ /ఫార్మర్‌ ఐడీ సమకూరుస్తున్నారు. ఒక రైతు ‘ఒక గుర్తింపు-సమగ్ర సేవలు‘ లక్ష్యంగా అన్నదాతల వివరాలను డిజిటల్‌గా నమోదు చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ప్రత్యేక శిబిరాలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1.25 లక్షల పట్టాదారులు ఆర్‌వో ఎఫ్‌ఆర్‌ పట్టాలు ఉండగా, రెవెన్యూ పట్టాలు 1.23 లక్షలున్నాయి. ముఖ్యంగా ఆర్‌ వోఎఫ్‌ఆర్‌ పట్టాలకు రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తు తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోని రైతులు ప్రత్యేక శిబిరాల్లోనైనా చేయించు కోవాలని శాఖ విస్త్రృతంగా ప్రచారం చేపడుతోంది. ఇందులో భాగంగా ఆయా మండల కేంద్రాల్లో, గ్రామాలు, పల్లెల్లోనూ దండోరా వేయిస్తున్నారు.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 70 శాతం పైగా రిజిస్ట్రే షన్‌ పూర్తి కాగా, కేవలం 60 వేల ఎకరాలు కేవలం ఆర్‌వోఎఫ్‌ఆర్‌ భూములున్నాయి. అలాగే వివిధ చోట్ల భూములున్న రైతులకు కూడా సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. జిల్లాలోని జైనూరు, కౌటాల, సిర్పూర్‌ (యు) మండలాల్లో 80 శాతం పైగా పూర్తి అయ్యింది. రెబ్బన, కాగజ్‌నగర్‌ మండలంలో ఇంకా వెనుకబాటులో ఉంది. ఓపెన్‌ కాస్టు భూములుం డడంతో రెబ్బెనలో, స్థానికేతర సమస్య ఉన్నటువంటి నజ్రూల్‌ నగర్‌ బెంగాళీ కాంపుల్లో రైతులు ముందుకు రావడం లేదు. అలాగే ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా ఒకే చోటకు అన్ని భూముల వివరాలు వస్తాయనే ఉద్దేశంతో రైతులు ముందుకు రావడం లేదు. అలాగే పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి చిన్న చిన్న కమ తాలకు రిజిస్ట్రేషన్‌ చేయించడంలో ఆసక్తి చూపడం లేదు. ఒక్కసారి ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్న రైతులు మరో చోట భూములకు కాకపోవడం, గోప్యత ప్రదర్శించడం లాంటి కారణాలతో కూడా ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు పేర్కొంటు న్నారు. అలాగే మృతి చెందిన, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం ఆసక్తి కనబరచడం లేదు. దీంతో పాటు ఇతర సమస్యలున్నాయి.

- ప్రక్రియ ఇలా..

రైతులు తమ మీసేవా కేంద్రాలు లేదా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద సంప్రదించి వివరాలను నమోదు చేసుకోవాలి రైతు రిజిస్ట్రేషన్‌ పూర్తయితే భవిష్యత్తులో వివిధ వ్యవసాయ సేవలు, ప్రభుత్వ పథకాలు సులభంగా అందించేందుకు వీలవుతుంది. రైతు సాగు చేస్తున్న వరి, పత్తి, మొక్కజొన్న, తదితర పంటల వివరలను డిజిటల్‌ నమోదుకు ఉపయోగపడుతుంది. ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ (ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్స్‌ యాప్‌) ద్వారా ఎరువుల పంపిణీ/కొనుగోలు ప్రక్రియను పారద ర్శకంగా నిర్వహించవచ్చు. బ్యాంకింగ్‌, వ్యవ సాయ రుణ సేవలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఇతర వ్యవసాయ కార్యక్రమాల ప్రయోజనలను సుల భతరంగా అందించేందుకు ఈ డేటా దోహదప డుతుంది.

ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు..

- వెంకట్‌, జిల్లా వ్యవసాయాధికారి

ఇప్పటి వరకు కూడా నమోదు చేసుకోని రైతులు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాల్లో అయినా తప్పక నమోదు చేసుకోవాలి. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వ పథకాలు ప్ర యోజనాలను ఉపయో గించుకోవాలి. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలున్నా ఎక్కువ రైతులకు ఇబ్బందులున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 70 శాతం రైతులు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసు కున్నారు. విగితావి త్వరగా పూర్తి చేస్తాం.

Updated Date - Oct 04 , 2026 | 10:39 PM