Share News

వరికొయ్యలు కాలుస్తూ ఊపిరాడక రైతు మృతి

ABN , Publish Date - May 29 , 2026 | 03:34 AM

వరికొయ్యలను కాలుస్తూ పొగలో ఊపిరాడక ఓ రైతు మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లిలో ...

వరికొయ్యలు కాలుస్తూ ఊపిరాడక రైతు మృతి

ఇల్లంతకుంట, మే 28 (ఆంధ్రజ్యోతి): వరికొయ్యలను కాలుస్తూ పొగలో ఊపిరాడక ఓ రైతు మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఎలుక నారాయణ (65) అనే రైతు గురువారం తన వ్యవసాయ భూమిలో పంట కోయగా మిగిలిన వరికొయ్యలను కాల్చాడు. కొంతసేపటికే అతని చుట్టూ మంటలు వ్యాపించడంతో భారీగా పొగ కమ్మేసి ఊపిరాడక మృతిచెందాడు. నారాయణ మృతదేహం పాక్షికంగా మంటల్లో కాలిపోయింది. నారాయణ భార్య కొంతకాలం క్రితం మరణించగా, కొడుకు కుటుంబంతో ముంబైలో ఉంటున్నాడు.

Updated Date - May 29 , 2026 | 03:34 AM