వెళ్లిరా గణపయ్య..
ABN , Publish Date - Sep 25 , 2026 | 11:11 PM
భోలో గణేష్ మ హరాజ్‌కు జై.. గణపతి బప్ప మోరియా... నినాదాలతో మంచిర్యాల పట్ట ణం మార్మోగింది. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆధ్మాత్మిక శోభను సంతరిం చుకుంది. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న పార్వతి తనయుడిని భ క్తి శ్రద్ధలతో గంగమ్మ ఒడికి చేర్చారు.
గంగమ్మ చెత్తకు గణనాథులు
-జిల్లా కేంద్రంలో ఘనంగా నిమజ్జన కార్యక్రమాలు
-ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఆకట్టుకున్న మహిళల కోలాటాలు..
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : భోలో గణేష్ మ హరాజ్‌కు జై.. గణపతి బప్ప మోరియా... నినాదాలతో మంచిర్యాల పట్ట ణం మార్మోగింది. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆధ్మాత్మిక శోభను సంతరిం చుకుంది. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న పార్వతి తనయుడిని భ క్తి శ్రద్ధలతో గంగమ్మ ఒడికి చేర్చారు. వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనాన్ని ప్రారంభించారు. బాణాసంచా కాలుస్తూ రంగు లు చల్లుకుంటూ యువకులు, మహిళలు డప్పు బ్యాండ్ వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ గణనాథుడి శోభాయాత్ర నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ని యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులోని గోదావరి తీరానికి గణనాథులు చేరగా ఉత్సవ సమితి సభ్యులు, ముఖ్య అ తిథుల ఆధ్వర్యంలో ఏకదంతుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. వినాయకుడికి మాజీ ఎమ్మెల్యే పూజలు
పాత మంచిర్యాలలో ప్రతిష్టించిన పలు మండపాల్లోని వినాయకుడిని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ కుమార్‌లు దర్శించుకున్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు.
భారీగా పోలీసుల బందోబస్తు
వినాయక నిమజ్జనం సందర్భంగా మంచిర్యాలలో డీసీపీ భాస్కర్ నేతృ త్వంలో ఐబీ చౌరస్తా నుంచి గోదావరి తీరం వరకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మున్సిప ల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తాలో స్టేజీని ఏర్పాటు చేసిన భక్తులకు అల్పాహారం, మంచినీరు, నిమజ్జనం వాహనాలకు తగు సూచనలు చేశారు.
మంచిర్యాలక్రైం : జిల్లా కేంద్రంలో నిమజ్జన కార్యక్రమాలు అందర్ని అల రించాయి. చిన్నారులు, మహిళలు, కళాకారులు నృత్యాలు చేసి ఆకట్టుకున్నా రు. మంచిర్యాలలోని విశ్వనాధ స్వామి ఆలయంలో, లక్ష్మీనారాయణ ఆల యంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు గణనాథుడిని దర్శించుకుని ప్ర త్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ నిమజ్జనం ప్రశాంతంగా జ రిగేలా అందరు సహకరించాలన్నారు. వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను కార్పొరేటర్ మా దంశెట్టి సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్ నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ బానేష్, తిరుపతి, మహేష్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సుధాకర్ పాల్గొన్నారు.
గర్మిళ్ల : మంచిర్యాలలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అ న్ని ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. శుక్రవారం ని మజ్జన శోభాయాత్ర ఉత్సవాల్లో భాగంగా జెండా ఊపి శోభాయాత్రను ప్రా రంభించారు. హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలు కగా కొబ్బరికాయలు కొట్టి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్ర మం లో డీసీపీ భాస్కర్, మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్ఠీ అ ధ్యక్షుడు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గుండ సుధాకర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, హిందూ ఉత్సవకమిటీ సభ్యులు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
నస్పూర్ : నస్పూర్‌లో శుక్రవారం నిర్వహించిన నిమజ్జనోత్సవ శోభా యాత్రలు ప్రశాంతంగా జరిగాయి, హౌసింగ్ బోర్డు కాలనీ, సీసీసీ, ఫ్లడ్ కాలనీ, తదితర ప్రాంతాల్లో మహిళల కోలాటాలు, నృత్యాలతో ఆనందోత్స వాల మద్య గోదావరి నదికి నిమజ్జనం కోసం గణపతయ్యను తరలించారు. ఎస్సై తహసినోద్దిన్ బందోబస్తు నిర్వహించారు.
దండేపల్లి: పలు ప్రాంతాల్లో నెలకొల్పిన గణనాథులను తొమ్మిది రోజుల అనంతరం గూడెం గోదావరిలో నిమజ్జనం చేశారు. గోదావరి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ పోలీసు బందోబస్తు, గజ ఈతగాళ్లు ఏర్పాటు చేశారు. వేడుకలను తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే ల క్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై రాజవర్థన్ పర్యవేక్షించారు.
బెల్లంపల్లి: బెల్లంపల్లి కాల్‌టెక్స్ కెమికల్ ప్రాంతంలోని హనుమాన్ మం దిరంలో గణేష్ నవరాత్రుల ముగింపు సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూ జలను నిర్వహించారు. గణపతి సహస్రనామ అభిషేకం, హోమం, అన్నదా న కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతర గణనాథుడి నిమజ్జనం కోసం తరలించారు.