kumaram bheem asifabad- అభివృద్ధికి దూరం
ABN , Publish Date - Nov 16 , 2026 | 10:37 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధి కోసం ఆర్థిక సంఘం నిధులు, వీబీజీరామ్‌జీ, జనరల్ ఫండ్ తదితర నిధులను ఏటా విడుదల చేస్తున్నప్పటికీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. కాగజ్‌నగర్ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్నప్పటికీ కూడా వీటి అభివృద్ధి జరుగడం లేదు.
- వంతెనలు లేక వర్షాకాలంలో నిలిచిపోతున్న రాకపోకలు
- పట్టించుకోని అధికారులు, నాయకులు
కాగజ్‌నగర్ టౌన్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధి కోసం ఆర్థిక సంఘం నిధులు, వీబీజీరామ్‌జీ, జనరల్ ఫండ్ తదితర నిధులను ఏటా విడుదల చేస్తున్నప్పటికీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. కాగజ్‌నగర్ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్నప్పటికీ కూడా వీటి అభివృద్ధి జరుగడం లేదు. కాగజ్‌నగర్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దరిగాం సమస్యల వలయంలో ఉం ది. ఈ గ్రామానికి వెళ్లేందుకు కనీస రోడ్డు సౌకర్యం లేదు. మధ్యలోని ఒర్రెలపై వంతెనలు లేవు. ఈ గ్రామానికి చెందిన వారు నిత్యం కాగజ్‌నగర్‌కు రావాలంటే కాలినడకే శరణ్యమవుతోంది.
- ఏళ్లుగా సమస్య ఉన్నా..
ఏళ్లుగా ఈ సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వాలు మారుతున్నా ఈ గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించ డం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అత్యవసర పరిస్థితి వస్తే దేవుడిపై భారం వేసి కాలం గడుపాల్సిన పరిస్థితి ఉంది. కాగజ్‌నగర్ చెక్ పోస్టు సమీపం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాపూర్ పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంది. గ్రామానికి వెళ్లేందుకు వంతెన కూలి పోయి ఇప్పటికీ ఆరు సంవత్సరాలు గడిచింది. చిన్నపాటి వర్షం కురిసిందంటే చాలు గ్రామ సమీ పంలో ఉన్న వాగు పూర్తిగా ఉప్పొంగి పోతోంది. తమకు వంతెన నిర్మించాలని అధికారులకు గ్రామస్తులు వినతి పత్రాలు అందజేశారు. అలాగే నాయకు లు, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. అయినా కూడా ఇంత వరకు పరిస్థితి ఏ మాత్రం మారలేదని పలువురు చెబుతున్నారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక పోవడంతో నిత్యం అవస్థలు పడాల్సి వస్తోందని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు.
- వాంకిడికి వెళ్లే ప్రధాన రహదారిపై..
మండలంలోని అంకుసాపూర్ గ్రామం నుంచి వాంకిడికి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో కూడా వంతెన నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే వాంకిడికి ఆసిఫాబాద్ మీదుగా కాకుండా అంకుసాపూర్ మీదుగా మార్గంతో కిలో మీటర్ల మేర తగ్గి దగ్గరగా ఉం టుంది. 2009లో ఈ వంతెనకు నిర్మాణం ప్రారంభిం చారు. ప్రభుత్వాలు మారడం, నిధులు విడుదల చేయక పోవడంతో కాంట్రాక్టర్ మధ్యలోనే చేతులె త్తాశారు. దీంతో ఆయా గ్రామాల్లోని వందలాది కుటుంబాలు కాలినడకనే కాగజ్‌నగర్‌కు రావాల్సిన పరిస్థితి. గిరి గ్రామాలు అభివృద్ధి చెందుతాయని గత ప్రభుత్వం ఈ పనులకు రివైజ్ టెండర్లను పిలిచి పనులు ప్రారంభించినప్పటికీ కూడా ఇంకా పిల్లర్ల దశ వీడని పరిస్థితి ఉంది. వర్షాకాలం వచ్చిదంటే ఈ గ్రామాలకు పూర్తిగా రాకపోకలు సాగని పరిస్థితి ఏర్పడింది. కేవలం చలి కాలం, ఎండ కాలం మాత్రమే తాత్కాలి మట్టి రోడ్డు గుండా వెళ్లాల్సి ఉంటుంది.
- చిన్నపాటి వర్షం కురిస్తేనే..
చిన్నపాటి వర్షం కురిసిందంటే చాలు పూర్తిగా రోడ్డు కొట్టుకొని పోతోంది. దీంతో వాగు దాటాలంటే కూడా పోలేని పరిస్థితి ఉంది. తమకు శాశ్వత పరిష్కారం చూపాలని పలుమార్లు మొర పెట్టుకు న్నా పరిష్కారం చూపడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గిరి గ్రామాల అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్నప్పటికీ నిధులు విడుదల జాప్యం, అధికారులు పట్టింపులేని తనంతోనే సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. మండల పరిధిలోని కోసినిలో కూడా లోలెవల్ వంతెన ఉండడం చిన్న పాటి వర్షం కురిస్తేనే గుట్టలపై నుంచి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి రాకపోకలు నిలిచి పోతాయి. ఇప్పటికీ పలు ప్రమాదాలు జరుగుతున్న కూడా ఈ విషయంలో చర్యలు చేపట్టడం లేదు. రాత్రి వేళల్లో వాగు ఉప్పొంగి ప్రవహిస్తే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం గడుపుతున్నారు. కాగజ్‌నగర్ పట్ట ణ సమీప గ్రామాల పరిస్థితి ఇలా ఉంటే అటవీ ప్రాంత గిరి ప్రాంతాల పరిస్థితి ఏవిధంగా ఉందో ఊహించవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.