Share News

ప్రముఖ రచయిత ముక్తవరం పార్థసారథి కన్నుమూత

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:23 AM

ప్రముఖ రచయిత, అనువాదకుడు ముక్తవరం పార్థసారథి(82) ఇక లేరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లింగంపల్లిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స....

ప్రముఖ రచయిత ముక్తవరం పార్థసారథి కన్నుమూత

  • ఉత్తమ రచనలు తెలుగులోకి అనువదించిన ఘనత

హైదరాబాద్‌ సిటీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత, అనువాదకుడు ముక్తవరం పార్థసారథి(82) ఇక లేరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లింగంపల్లిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరిలో 1944, జూలై 7న ఆయన జన్మించారు. ప్రపంచ సాహిత్యంలోని ఉత్తమ రచనలను తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ఘనత ఆయన సొంతం. చైనా, ఆఫ్రికన్‌ జానపద కథలు, నోబెల్‌ పురస్కారాలు పొందిన సాహితీవేత్తల పరిచయం, జాక్‌ లండన్‌ ఐరెన్‌ హీల్‌కు ‘ఉక్కుపాదం’ తెలుగు అనువాదం, షేక్‌స్పియర్‌ కథలు వంటి అనువాదాలెన్నో ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చా యి. అంతర్జాతీయ సాహిత్యంపై సాధికారత కలిగిన అతి తక్కువ మంది తెలుగు వారిలో పార్థసారథి ఒకరు. ఆయన అనువాదాలు మొత్తం 65కుపైగా పుస్తకాలుగా వెలువడ్డాయి. సాహిత్య సేవతో పాటు ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగిగానూ పనిచేశారు. పార్థసారథి మృతికి పలువురు కవులు, రచయితలు సంతాపం తెలిపారు. సంగిశెట్టి శ్రీనివాస్‌, శ్రీరామోజు హరగోపాల్‌, వీక్షణం వేణుగోపాల్‌, బమ్మిడి జగదీశ్వరరావు తదితరులు పార్థసారథి సాహిత్య కృషిని గుర్తు చేసుకున్నారు.

Updated Date - Mar 05 , 2026 | 01:23 AM