అభివృద్ధి చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారాలు
ABN , Publish Date - Aug 08 , 2026 | 11:20 PM
నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ దిగ జారుడుకు పాల్పడుతున్నా రని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు.
ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
మంచిర్యాలక్రైం, ఆగస్టు8 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ దిగ జారుడుకు పాల్పడుతున్నా రని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. మంచిర్యాల పట్ట ణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ రాజకీయ లబ్ధికోసం ఎదుర్కొనే ధైర్యం లేక లేని పోని ఆరోపణలు చేస్తూ ప్రజలను తపుదోవపట్టించే యత్నం చేస్తు న్నారన్నారు. బ్యాంక్ నుంచి సాయినాథ్ ఎస్టేట్, భాగ్యనగర్ కంపెనీల ద్వారా నాలుగు బ్యాంకుల్లో 109కోట్లు రుణాన్ని తీసుకున్నామన్నారు. దానిని మొత్తం వడ్డీతో కలిపి 190 కోట్లు రెండు దఫాలుగా చెల్లించా మన్నారు. బ్యాంకులో 450 కోట్లు రుణం మంజూరు అయినప్పటికీ దానిని కేవలం 190 కోట్లు మాత్రమే తీసుకున్నారన్నారు. ప్రతిపక్ష నా యకులు అవగాహన లేమితో మాట్లాడడం సరికాదన్నారు. దీనిపై బ హిరంగ చర్చకు తాను సిద్ధమని దమ్ముంటే చర్చకు రావాలన్నారు. గతంలో లేని విధంగా నియోజకవర్గ అభివృద్ధి చూసి ఓర్వలేక నాయ కులు ఒకటై తమపై దాడికి యత్నిస్తున్నారన్నారు. గూడెం దవాల యాన్ని 58కోట్లతో అభివృద్ధి చేసి టూరిజం స్థలంగా తీర్చిదిద్దుతా నన్నారు. గోదావరినదిపై 12కోట్లతో పుష్కరఘాట్ నిర్మించి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గూడెం దేవస్థానం వరకు టూరిజం కింద బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. మంచిర్యాల విశ్వనాథ ఆలయాన్ని ఉత్తర ద్వారా దర్శనం చేసుకునే విధంగా తీర్చిదిద్దుతానని అన్నారు. దీని కో సం పండితులతో పాటు టీటీడీ దేవస్థానం వారి సలహాలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గంలో ఇచ్చిన హామీలకంటే మరెన్నో అభివృ ద్ధి పనులు చేశానని అవన్నీ చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రతిపక్ష నాయకులు నిజాలు మాట్లాడాలని లేనిపోని అసత్యాలు మానుకోవాలన్నారు. తన నియోజకవర్గానికి ఎవరు వచ్చి నా తనకు సమాచారం ఇస్తే ఎటువంటి ఇబ్బంది కలుగదన్నారు. ఎ న్నికల సమయంలో పార్టీ గెలుపుకోసం అహర్నిశలు కృషి చేశానని తె లిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సు రేఖ, మేయర్ ధర్ని మధూకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బానేష్, నగర పాలక సంస్థ అధ్యక్షులు తూ ముల నరేశ్, నాయకులు చిట్ల సత్యనారాయణ, మంగిలాల్ సోమాని, తిరుపతి పాల్గొన్నారు