బీడు భూములు సస్యశ్యామలం
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:20 AM
మూసీ జలాల మళ్లింపుతో బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని చౌటుప్పల్ ఏఎంసీ వైస్‌చైర్మన్, మూసీ జలసాధన కమిటీ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి అన్నారు.
మూసీ జల సాధన కమిటీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి
చౌటుప్పల్ టౌన్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మూసీ జలాల మళ్లింపుతో బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని చౌటుప్పల్ ఏఎంసీ వైస్‌చైర్మన్, మూసీ జలసాధన కమిటీ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి అన్నారు. స్థానిక దివీస్ పరిశ్రమ తమ సీఎస్సార్ నిధులనుంచి కేటాయించిన రూ.1.06కోట్లతో చేపట్టిన పిలాయిపల్లి కాల్వనుంచి మూసీ జలాల మళ్లింపు పథకం పనులను గురువారం ఇంద్రసేనారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని చిన్నకొండూరు సమీపంనుంచి వెళ్తున్న పిలాయిపల్లి కాల్వ వద్ద లిఫ్ట్‌ను ఏర్పాటు చేసి పైప్‌లైన్ ద్వారా మునిసిపాలిటీలోని లక్కారం వద్దనున్న రెండు కుంటలను నింపేందుకు ఈపథకాన్ని రూపొందించామన్నారు. ఈ రెండు కుంటలలోకి చేరిన మూసీజలాలతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగి చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల పరిధిలోని బావులు, బోర్లలోకి నీరు పైకి వస్తుందని, దీంతో సుమారు 200 ఎకరాల బీడు భూములు అదనంగా సాగులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బద్రి గాలయ్య, మాజీ ప్రజాప్రతినిధులు కొయ్యడ సైదులు, కాసర్ల శ్రీనివా్‌సరెడ్డి, దుబ్బాక శ్రీనివా్‌సరెడ్డి, రైతు నాయకులు జి.నర్సింహ, ఎస్.మధుసూదన్‌రెడ్డి, ఆకుల తిరుమల్‌రెడ్డి, ఎం.మల్లేశం, ఐలయ్య, యాదయ్య, రాములు, రాఘవరెడ్డి, యాదిరెడ్డి, పెంటయ్య, జంగయ్య, రాజేశ్, దివీస్ పరిశ్రమ ప్రతినిధి గోపి పాల్గొన్నారు.