Share News

10గంటలు ఆలస్యంగా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:43 AM

సింగిల్‌ ట్రాక్‌పై డబుల్‌ డిజిట్‌ సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడుస్తుండడంతో, వాటి ప్రభావం రెగ్యులర్‌ రైళ్లపై పడుతోంది.

10గంటలు ఆలస్యంగా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌

  • రెగ్యులర్‌ రైళ్లపై ప్రత్యేక రైళ్ల ప్రభావం

హైదరాబాద్‌ సిటీ, మార్చి 4(ఆంధ్రజ్యోతి): సింగిల్‌ ట్రాక్‌పై డబుల్‌ డిజిట్‌ సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడుస్తుండడంతో, వాటి ప్రభావం రెగ్యులర్‌ రైళ్లపై పడుతోంది. వివిధ స్టేషన్లలో ప్రత్యేక రైళ్లకు క్రాసింగ్‌ కోసమని దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను గంటల కొద్దీ నిలిపివేస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హౌరా నుంచి సికింద్రాబాద్‌కు బుధవారం ఉదయం 10.30 గంటలకు చేరుకోవాల్సిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ 10గంటలు ఆలస్యంగా రాత్రి 8.43కు చేరుకుంది. ఇదే రైలు(రేక్‌) సికింద్రాబాద్‌ నుంచి గూడూరుకు సింహపురి ఎక్స్‌ప్రె్‌సగా బుధవారం రాత్రి 10గంటలకు బయల్దేరాల్సి ఉండగా, మెయింటెనెన్స్‌ పనుల అనంతరం 5గంటలు ఆలస్యంగా, గురువారం తెల్లవారుజామున 3గంటలకు బయల్దేరేలా రీషెడ్యూల్‌ చేశారు. పగిడిపల్లి-నల్లపాడు సెక్షన్‌ సింగిల్‌లైన్‌ కావడం, వందకు పైగా రెగ్యులర్‌ ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు, ప్రత్యేక రైళ్లు, వందేభారత్‌, అమృత్‌ భారత్‌ వంటి సెమీ హైస్పీడ్‌ రైళ్లకు పలు స్టేషన్లలో క్లియరెన్స్‌ ఇవ్వడం సిబ్బందికి సవాల్‌గా మారింది. అడపాదడపా గూడ్సు రైళ్లను కూడా క్లియర్‌ చేయాల్సి రావడంతో పలుమార్లు సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు సైతం 10 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయి. సింగిల్‌లైన్‌లో రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడానికి వివిధ స్టేషన్ల మధ్య జరుగుతున్న నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు, పలు స్టేషన్లలో పునరాభివృద్ధి పనులు కూడా కారణం కావచ్చని రైల్వే సిబ్బంది చెబుతున్నారు.

Updated Date - Mar 05 , 2026 | 01:43 AM