Share News

ఓటర్లకు నకిలీ వెండికాయిన్ల పంపిణీ

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:51 AM

మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా అలియాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిచేందుకు ఆ పార్టీ నాయకులు ఓటర్లకు నకిలీ వెండి కాయిన్లను పంచారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.

ఓటర్లకు నకిలీ వెండికాయిన్ల పంపిణీ

శామీర్‌పేట, ఫిబ్రవరి11 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా అలియాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిచేందుకు ఆ పార్టీ నాయకులు ఓటర్లకు నకిలీ వెండి కాయిన్లను పంచారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. లాల్‌గడి మలక్‌పేటలోని 5వ వార్డులో బీజేపీ అభ్యర్థి కన్‌రెడ్డిమాలతి విజయం కోసం ఆ పార్టీ శ్రేణులు వెండి నాణేలను పంచారని ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు, నాయకులు ఎన్నికల అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓటర్లు ఆ వెండి నాణేలను తనిఖీ చేసుకోగా అవి నకిలీవి అని తేలడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు.

Updated Date - Feb 12 , 2026 | 02:51 AM