Share News

కడ్తాల్‌లో కల్తీపాల దందా గుట్టురట్టు

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:20 AM

రసాయనాలతో కల్తీ పాలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓ ముఠా గుట్టును బుధవారం పోలీసులు రట్టు చేశారు.

కడ్తాల్‌లో కల్తీపాల దందా గుట్టురట్టు

కడ్తాల్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రసాయనాలతో కల్తీ పాలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓ ముఠా గుట్టును బుధవారం పోలీసులు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలంలోని రావిచెడ్‌ గ్రామంలో సాగుతున్న నకిలీ పాలకేంద్రంపై మహేశ్వరం ఎస్‌వోటీ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో కల్తీ పాలు తయారు చేస్తున్న అనగోని శ్రీశైలం అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా నిందితుడి వద్ద నుంచి భారీగా ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 45 ప్యాకెట్ల కాఫీ క్రీమర్‌, 12 ప్యాకెట్ల ఉప్పు, చక్కెరతో పాటు ఆరు క్యాన్‌లలో నిల్వ ఉంచిన కల్తీపాలను సీజ్‌ చేసినట్లు స్థానిక సీఐ గంగాధర్‌ తెలిపారు.

Updated Date - Feb 26 , 2026 | 03:20 AM