నకిలీ ఫైర్ ఎన్‌వోసీల వెనక ఎవరున్నారు?
ABN , Publish Date - Aug 07 , 2026 | 05:57 AM
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాలేజీల నకిలీ ఫైర్ ఎన్‌వోసీల తతంగానికి సంబంధించి 52 కళాశాల వివరాలను హైడ్రా గురువారం పోలీసులకు అందజేసింది.
ఏదైనా ముఠా పనా? కాలేజీలే చేశాయా?
ఎవరెవరి సంతకాలు ఫోర్జరీ చేశారు?
ఆరా తీస్తున్న పోలీసులు.. 52 కళాశాలల వివరాలను అందించిన హైడ్రా
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాలేజీల నకిలీ ఫైర్ ఎన్‌వోసీల తతంగానికి సంబంధించి 52 కళాశాల వివరాలను హైడ్రా గురువారం పోలీసులకు అందజేసింది. అసలు ఈ వ్యవహారం ఎలా జరిగింది? ఎవరెవరి సంతకాలు ఫోర్జరీ చేశారు? దీని వెనుక ఏదైనా రాకెట్ ఉందా? లేక కళాశాలల యాజమాన్యాలే వేటికవి నకిలీ ఫైర్ ఎన్‌వోసీలను సృష్టించాయా? తెలుసుకోవడానికి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ వ్యవహారం ఎన్నేళ్లుగా జరుగుతోంది? ఇంటర్‌బోర్డు అధికారులు యజమాన్యాలకు సహకరించారా? నిజంగా ఫైర్ ఎన్‌వోసీ ఏ విభాగం ఇస్తుందన్నది బోర్డు అధికారులకు తెలియదా? అనే విషయాలపైనా ఆరా తీస్తున్నారు. కాగా.. హైందవి కళాశాలకు చెందిన నకిలీ ఎన్‌వోసీపై ఫిర్యాదు రాగా ఇంటర్ బోర్డుకు లేఖ రాసి, మొత్తం ఫైర్ ఎన్‌వోసీలను పరిశీలించామని హైడ్రా చెబుతోంది. మొదటి దశలో 76 కళాశాలల ఫైర్ ఎన్‌వోసీలను పరిశీలించగా.. వాటిలో ఏడు, రెండో విడతలో 66 కళాశాలల్లో 45 కాలేజీలు నకిలీ ఎన్‌వోసీలు ఇచ్చినట్లు గుర్తించామని తెలిపారు. మొదటి విడతలో బోర్డు అధికారులు ఇచ్చిన వివరాల్లో కేవలం పది శాతం నకిలీ ఎన్‌వోసీలు ఉండగా.. రెండో విడత వివరాల్లో 68 శాతం కళాశాలలు నకిలీ ఎన్‌వోసీలు సమర్పించినట్టు తేలడం అనుమానాలకు తావిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే ఇంటర్ బోర్డు అధికారులు మొదటి దశలో ఎన్‌వోసీలు సరిగా ఉన్న కాలేజీల వివరాలు మాత్రమే పంపారా? అంతటితో హైడ్రా విచారణ ముగుస్తుందని భావించారా? అనే చర్చ జరుగుతోంది. అనూహ్యంగా.. హైడ్రా అధికారులు అన్ని ఎన్‌వోసీల వివరాలు కావాలని కోరడంతో గుట్టు బయటపడినట్టు చెబుతున్నారు. కాగా.. హైడ్రా అధికారులు పోలీసులకు సమర్పించిన కళాశాలల వివరాలు..
హైందవి జూనియర్ కళాశాల, బర్కత్‌పుర. రెసొనెన్స్ జూనియర్ కళాశాల, ఎస్‌ఆర్ నగర్. ప్రియాంక జూనియర్ కళాశాల, మెహదీపట్నం. మదర్స్ గర్ల్స్ జూనియర్ కళాశాల, విద్యానగర్. శ్రీచంద్ర జూనియర్ కళాశాల, చాంద్రాయణగుట్ట. న్యూ ఎరా జూనియర్ కళాశాల, చిక్కడపల్లి. షాహిన్ జూనియర్ కళాశాల, శివరాంపల్లి. వశిష్ట జూనియర్ కళాశాల, ఆర్‌సీ పురం. బాబుల్‌రెడ్డి జూనియర్ కళాశాల, ఎర్రగడ్డ. న్యూ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, టోలిచౌకి. ఎస్‌ఎం అలీస్ శాంతినికేతన్ జూనియర్ కళాశాల, మెహదీపట్నం. శ్రీ అక్షర జూనియర్ కళాశాల, ఎల్లారెడ్డిగూడ. అచీవర్స్ జూనియర్ కళాశాల, టోలిచౌకి. హిదయ జూనియర్ కళాశాల, అసి్‌ఫనగర్. జునైద్స్ జూనియర్ కళాశాల, హుమాయున్‌నగర్. సెయింట్ ప్యాట్రిక్స్ ఆల్టిట్యూడ్ జూనియర్ కళాశాల, నల్లకుంట. ఫిట్ జీ జూనియర్ కళాశాల, నారాయణగూడ. శ్రీవాణి జూనియర్ గర్ల్స్ కాలేజ్, మలక్‌పేట. ఎస్‌వీ జూనియర్ కాలేజ్ ఆఫ్ కామర్స్, చంపాపేట. శ్రీ శ్రీనివాస జూనియర్ కళాశాల, సంతోష్ నగర్. విజనరీ జూనియర్ కళాశాల, శాలిబండ. ముషీరాబాద్ గర్ల్స్ జూనియర్ కళాశాల, ముషీరాబాద్. విజనరీ జూనియర్ కళాశాల (ఒకేషనల్), శాలిబండ. సరోజిని నాయుడు జూనియర్ కళాశాల, చిక్కడపల్లి. లైఫ్‌లైన్ జూనియర్ కళాశాల, చార్మినార్.
నానో జూనియర్ కళాశాల, నల్లకుంట. ఆద్య జూనియర్ కళాశాల, దిల్‌సుఖ్‌నగర్. హిదయ జూనియర్ కళాశాల, న్యూ సంతోష్ నగర్. ఐఏసీజీ ఒకేషనల్ జూనియర్ కళాశాల, ముసారాంబాగ్. శ్రీ సాయి చైతన్య, జూనియర్ కళాశాల, సికింద్రాబాద్. సింధు గర్ల్స్ జూనియర్ కళాశాల, మెహిదిపట్నం. మాస్టర్ జూనియర్ కళాశాల, యూసు్‌ఫగూడ. సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కళాశాల, బేగంబజార్. విదీష జూనియర్ కళాశాల, సికింద్రాబాద్. శ్రీ మేధ జూనియర్ కళాశాల, అత్తాపూర్. ఎక్సలెన్స్ జూనియర్ కళాశాల, మదీనాగూడ. విశ్వభారతి జూనియర్ కళాశాల, హైదర్‌షాకోట. వికాస్ జూనియర్ కళాశాల, వనస్థలిపురం. శ్రీ తపస్య జూనియర్ కళాశాల, బండ్లగూడ జాగీర్. జ్ఞానదీపిక జూనియర్ కళాశాల, మాదాపూర్. భార్గవ జూనియర్ కళాశాల, సరూర్‌నగర్. విజ్ఞానభారతి జూనియర్ కళాశాల, యాప్రాల్. శ్రీ అభ్యాస జూనియర్ కళాశాల, అల్వాల్. సీఎంఎస్ జూనియర్ కళాశాల, ఇసీఐఎల్. ఎక్సలెన్స్ జూనియర్ కళాశాల, పేట్‌బషీరాబాద్. శ్రీ నారాయణ కామర్స్ జూనియర్ కళాశాల, ఉప్పల్. ఎక్సలెన్స్ జూనియర్ కళాశాల, దమ్మాయిగూడ. శ్రీ చైతన్య భారతి జూనియర్ కళాశాల, శేరిలింగంపల్లి. ఇక్బాలియా జూనియర్ కళాశాల, అత్తాపూర్. కైట్స్ జూనియర్ కళాశాల, ఓల్డ్ బోయిన్‌పల్లి. కెరీర్ పాయింట్ జూనియర్ కళాశాల, పేట్ బషీరాబాద్. శ్రీ వెంకట పద్మావతి జూనియర్ కళాశాల, బోరబండ.