నకిలీ ఎరువుల గుట్టురట్టు !
ABN , Publish Date - Sep 25 , 2026 | 04:08 AM
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూర్‌లో నకిలీ ఎరువుల తయారీ గుట్టు రట్టయింది.
రూ.20 లక్షల విలువైన ఎరువులు సీజ్
కుంట్లూరులో ఇద్దరి అరెస్టు
అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూర్‌లో నకిలీ ఎరువుల తయారీ గుట్టు రట్టయింది. వ్యవసాయ అధికారులు చేసిన దాడిలో రూ. 20 లక్షల విలువైన 513 నకిలీ ఎరువుల బస్తాలతో పాటు తయారు చేసి సిద్ధంగా ఉంచిన ముడిరుకును, తయారీ సామాగ్రిని సీజ్ చేశారు. మణినాయక్ అనే వ్యక్తి కుంట్లూర్ ఉషోదయ కాలనీలో ప్లాట్ నం.43, 54ను అద్దెకు తీసుకుని నకిలీ ఎరువులను తయారు చేయిస్తున్నాడు. సమాచారం అందుకున్న వ్యవసాయ అధికారులు హయత్‌నగర్ పోలీసులతో కలిసి నకిలీ ఎరువుల తయారీ కేంద్రంపై దాడి చేసి 513 బస్తాలు, ఇతర సామగ్రిని సీజ్ చేశారు. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేయగా మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడు.