లక్షెట్టిపేటలో నకిలీ కరెన్సీ చలామణి
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:39 PM
లక్షెట్టిపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో నకిలీ కరెన్సీ చలామణీ చేస్తున్న ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 12మంది నిందితులతో పాటు మూడు కార్లు, 12 సెల్‌ఫోన్లు, రూ.5.98లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు
ఫ12మంది నిందితుల అరెస్టు..
ఫరూ.5.98లక్షల నకిలీ కరెన్సీ, మూడు కార్లు స్వాధీనం
లక్షెట్టిపేట, పిబ్రవరి, 28 (ఆంధ్రజ్యోతి): లక్షెట్టిపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో నకిలీ కరెన్సీ చలామణీ చేస్తున్న ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 12మంది నిందితులతో పాటు మూడు కార్లు, 12 సెల్‌ఫోన్లు, రూ.5.98లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌లో శనివారం రాత్రి ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ కేసు వివరాలు వెల్లడించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. లక్షెట్టిపేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్‌లో ఫిబ్రవరి 25వ తేదీన ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి రూ.1500 డీజిల్‌ను పోయించుకుని మూడు ఐదు వందల రూపా యల నోట్లు ఒకే నంబర్‌వి ఇచ్చి వెళ్లిపోయారు. కాసేపటికి నోట్ల నంబర్లు గమనించిన బంకు వాళ్లు సీసీ కెమరాల ఆధారంగా కారును గుర్తించి లక్షె ట్టిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పట్టణ సీఐ రమణమూర్తి సిబ్బందితో కలిసి కారును గుర్తించి అను మానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఇటిక్యాలకు చెందిన కాను గంటి క్రాంతి, గడికొప్పుల రవీందర్, శ్రీరాంపూర్‌కు చెందిన తాండ్ర ప్రకాష్, వెంకట్రావుపేటకు చెందిన కోన మధుకర్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సుంక సుధాకర్, సుల్తానాబాద్‌కు చెందిన కమాని అనీల్ అనే ఆరు గురు నిందితులు మూఠాగా ఏర్పడి కాకినాడకు చెందిన రాము, రవి అనే ఇద్దరిని ఆశ్రయించి వాళ్ల దగ్గర నుంచిసుమారు రూ,6 లక్షల నకిలీ 500 రూపాయల నోట్లను తీసుకువచ్చి ఈ ప్రాంతంలో చలామణి చేస్తున్నట్లు తేలింది. సీఐ లోతుగా విచారణ చేపట్టగా రంగపేట గ్రామానికి చెందిన బం డారి సత్యనారాయణ, లక్షెట్టిపేటకు చెందిన రామునాయక్, జెండవెంక టా పూర్ గ్రామానికి చెందిన కందిమల్ల తిరుపతి, పెరుకపల్లికి చెందిన గోళ్ల కుమారస్వామి, లక్షెట్టిపేటకు చెందిన నగునూరి రాము, సిద్దిపేట మండలం తిమ్మయ్యపల్లికి చెందిన దేవనబోయిన సంపత్‌కుమార్ అనే మరో ఆరుగు రు నిందితులకు నకిలీ కరెన్సీ ఇచ్చినట్లు తెలిసింది. నిందితులు అందరూ వి విధ వ్యాపారాలు చేసి నష్టపోవడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న ఆశతో అందరూ దొంగనోట్ల వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తే లింది. ప్రస్తుతం 12మంది నిందితులను కోర్టులో హజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. కాకినాడకు చెందిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ చెప్పారు.