జోరుగా నకిలీ పత్తి విత్తనాల దందా
ABN , Publish Date - May 01 , 2026 | 11:18 PM
పత్తి సీజన్ సమీపి స్తుండటంతో నకిలీ విత్తనాల అక్రమ రవాణా ప్రారంభ మైంది. అక్రమార్కులు పెద్ద మొత్తంలో నకిలీ పత్తివిత్తనాలు సరఫరా చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా ప్రతియేటా కోట్లు విలువ చేసే నకిలీ దందా జోరుగా సాగుతోంది.
వివిధ రాష్ట్రాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా సరఫరా
పోలీసుల కళ్లుగప్పి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సరఫరా
ప్రతి యేటా కోట్లలో సాగుతున్న వ్యాపారం
మంచిర్యాల, మే 1 (ఆంధ్రజ్యోతి): పత్తి సీజన్ సమీపి స్తుండటంతో నకిలీ విత్తనాల అక్రమ రవాణా ప్రారంభ మైంది. అక్రమార్కులు పెద్ద మొత్తంలో నకిలీ పత్తివిత్తనాలు సరఫరా చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా ప్రతియేటా కోట్లు విలువ చేసే నకిలీ దందా జోరుగా సాగుతోంది. పోలీసుల కళ్లు గప్పి వివిధ రాష్ట్రాల నుంచి స్మగ్లర్లు గుట్టుచప్పుడు కా కుండా పెద్దమొత్తంలో నకిలీ సరుకును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులకు సరఫరా చేస్తున్నారు. విడి విత్తనాలు, బట్ట సంచుల్లో ప్యాక్ చేసిన నకిలీ విత్తనాలను నేరుగా రై తులకు అంటగడుతున్నారు. జిల్లాలోని కొందరు డీలర్లతో స త్సంబంధాలు నెరుపుతూ దళారుల అవతారం ఎత్తిన పలు వురు తక్కువ ధరకు వారికి సరఫరా చేస్తున్నారు. లైసెన్స్‌డ్ డీలర్ల కంటే బయటి వ్యక్తుల వద్ద విత్తనాలు చవకగా లభి స్తుండడంతో రైతులు వాటిని కొనేందుకు ఆసక్తి కనబరు స్తున్నారు. నాణ్యమైన విత్తనాలతో చేసే సాగుతో పోల్చితే నకిలీ విత్తనాలతో చేసే సాగుకు పెట్టుబడిలో భారీగా వ్య త్యాసాలు ఉండడంతో రైౖతులు వాటిపై వైపే మొగ్గు చూపు తున్నారు. నకిలీ పత్తి విత్తనాల సరఫరాను నియంత్రించేం దుకు పోలీసులు దాడులు చేస్తున్నా అక్రమ దందా కొన సాగుతుండడం గమనార్హం. నకిలీ విత్తనాల దుష్ప్రభావం, వాటివల్ల కలిగే నష్టాలపై వ్యవసాయ, పోలీసులు శాఖలు సంయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ రైతులకు అవ గాహన కల్పిస్తున్నా ఆశించిన ఫలితం ఉండటం లేదు.
మంచిర్యాల జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ పత్తివి త్తనాలు దిగుమతి అవుతున్నట్లు పోలీసుల విచారణలో వె ల్లడవుతోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుం చి ఈ నకిలీ విత్తనాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. ము ఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల నుంచి పెద్దమొత్తంలో సరఫరా అవుతున్నట్లు పో లీసులు అనుమానిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి, అక్కడి నుంచి దళారుల ద్వారా అక్రమంగా జిల్లాలోని రైతులకు విక్రయిస్తున్నారు. ఆంరఽఽధాకు చెందిన కొందరు పత్తి సాగు పేరుతో మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి, జైపూర్, తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటారు. ఇక్కడి భూములను కౌలుకు తీసుకొని నామమాత్రంగా వ్యవసా యం చేస్తూ ఇక్కడి విత్తన డీలర్లు, రైతులతో పరిచయాలు పెంచుకుంటారు. వారికి అనుకూలంగా ఉన్న వారితో ముఠాలను ఏర్పాటు చేసుకొని నకిలీ పత్తివిత్తనాలను రవాణా చే స్తారు. జిల్లావ్యాప్తంగా అక్కడక్కడ పోలీసులు జరిపిన దాడుల్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన పలువురు వ్యక్తులు పట్టుబడటమే దీనికి నిదర్శనం.
ఫ రూ. పది లక్షల విత్తనాలు పట్టివేత...
పది రోజుల క్రితం మంచిర్యాల జిల్లాలోని తాండూరులో రూ. 3,75,000 విలువగల 150 కిలోల పత్తి విత్తనాలు పట్టుబడగా, ఈ నెల 21న జిల్లాలోని వేమనపల్లి సమీపంలో ప్రాణహిత నది మీదుగా జిల్లాలోని నెన్నెలకు తరలిస్తున్న సుమారు లక్షా యాబైవేల రూపాయల విలువగల 50 కిలోల పైచిలుకు నకిలీ సరుకును పోలీసులు నిందితులతో సహా పట్టుకున్నారు. 28న కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కొమురవెల్లి గ్రామంలో రూ. 4,37,500 విలువగల 175 కిలోలను అక్కడి పోలీసులు పట్టుకున్నారు. జూలైలో పత్తి సీజన్ ప్రారంభం అయ్యే నాటికి కోట్లు విలువ చేసే నకిలీ విత్తనాలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులకు అందించడమే లక్ష్యంగా దళారులు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. పెరిగిన ఎరువుల ధరల కారణంగానే రైతులు చవకగా లభించే నకిలీ సరుకుపై ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది.