Share News

వాడిపోతున్న ఆశలు

ABN , Publish Date - Oct 11 , 2026 | 11:35 PM

పత్తి గూడ కట్టి కాత కాస్తోంది. వరి పైరు పొట్ట దశలో ఉంది. ఇ లాంటి కీలక సమయంలో వరుణుడు మోహం చాటేశా డు. పక్షం రోజులుగా వాన జాడ లేదు. దీనికి తోడు ఎండలు మండిపోతున్నాయి. చేలల్లో పదును లేక పత్తి చెట్లు వాలుమోహం వేస్తున్నాయి. చౌక నేలల్లోని చేలు ఎండిపోతున్నాయి.

వాడిపోతున్న ఆశలు

మండుతున్న ఎండలు

ఎండుతున్న పంటలు

మరోవైపు కరెంటు కష్టాలు

దిగుబడులపై తీవ్ర ప్రభావం

ఆందోళనలో రైతులు

నెన్నెల, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : పత్తి గూడ కట్టి కాత కాస్తోంది. వరి పైరు పొట్ట దశలో ఉంది. ఇ లాంటి కీలక సమయంలో వరుణుడు మోహం చాటేశా డు. పక్షం రోజులుగా వాన జాడ లేదు. దీనికి తోడు ఎండలు మండిపోతున్నాయి. చేలల్లో పదును లేక పత్తి చెట్లు వాలుమోహం వేస్తున్నాయి. చౌక నేలల్లోని చేలు ఎండిపోతున్నాయి. ఇప్పటికిప్పుడు వర్షం కురిస్తేనే పత్తి పంట చేతికొస్తుందని రైతులంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నష్టపోవాల్సిందేనని వాపోతున్నారు. మరో వైపు కరెంటు కోతలతో బోర్ల కింది వరి పొలాలకు సరి గ్గా నీరందడం లేదు. ఓ మడి నుంచి మరో మడికి నీరు చేరే సరికి కరెంటు పోతోంది. అనధికార కోతలు పెరిగి పోయాయి. మొటర్లు నడువక పంటలు ఎండిపో తు న్నాయని రైతులు అంటున్నారు. త్రీఫేజ్‌ కరెంటు ఎ ప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ఉంది. లోఓల్టేజీ సమ స్యలతో మోటర్లు కాలిపోతున్నాయి. నాణ్యమైన త్రీఫేజ్‌ కరెంటు ఇవ్వాలని రైతులు రొడ్డెక్కుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంటలు పూర్తిగా ఎండిపోతాయని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఒక్క వర్షం వస్తే గట్టెక్కుతామని, రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదరు చూస్తున్నారు.

పత్తి పంటపై తీవ్ర ప్రభావం

జిల్లాలో 1.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పత్తి పంటను వర్షాధారంగానే సాగు చేస్తారు. మొదట వర్షాలు లేక విత్తడం నెల రోజులు ఆలస్యమైంది. ఆ తర్వాత కురిసిన వర్షాలకు అందరూ విత్తుకున్నారు. అప్పటి నుంచి వర్షాలు అనుకూలంగానే కురిశాయి. మూడేసి సార్లు ఎరువులు వేసుకున్నారు. పలు సార్లు క్రిమిసంహారక, పురుగు మందులు పిచికారీలు చేసు కున్నారు. అప్పులు చేసి పంటకు పెట్టాల్సిన పెట్టుబడి మొత్తం పెట్టేశారు. ఇక దిగుబడి తీసుకోవడమే తరు వాయి. ఇలాంటి సమయంలోనే వాన జాడ లేదు. ఇ ప్పటి నుంచి వర్షం లేక పోతే మొదట కాసిన కాయలు మాత్రమే మిగులుతాయని, ఆ తర్వాత వచ్చిన గూడ మొత్తం రాలిపోతుందని అంటున్నారు. ఇలాగైతే దిగు బడిపై తీవ్ర ప్రభావం పడుతుందని, పెట్టుబడి కూడా చేతికి రాదని రైతులు వాపోతున్నారు.

-వరి రైతుకు కరెంటు కోతలతో ఇక్కట్లు..

వర్షాలు లేక సాగు నీటి కోసం తండ్లాడుతున్న రైతు లకు విద్యుత్‌ కోతలు శాపంగా మారాయి. బోర్ల కింద వరి సాగు చేస్తున్న రైతులకు కరెంటు కోతలతో ఇక్కట్ల పాలవుతున్నారు. వ్యవసాయ కనెక్షన్లకు త్రీఫేజ్‌ కరెంటు ఎప్పుడు ఇస్తారో తెలియకుండా ఉంది. లైన్‌రెస్ట్‌ పేరిట అనధికార కోతలు విధిస్తున్నారు. నాణ్యమైన కరెంటు రాక మోటర్లు మోరాయిస్తున్నాయి గతంలో వ్యవసాయ కనెక్షన్లకు టైమ్‌ టేబుల్‌ ప్రకారం త్రీఫేజ్‌ సరఫరా ఇచ్చే వారు. దీంతో రైతులు ఆ సమయంలో పొలాలకు చేరు కుని నీరు పారించుకునే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఒక మడి పూర్తిగా నిండక ముందే సరఫరా నిలి చిపోతోంది. కరెంటు వచ్చే సరికి మొదట పెట్టిన నీరు ఇంకిపోతోంది. త్రీఫేజ్‌. కరెంటు కో సం రైతులు రొడ్డెక్కాల్సిన పరిస్థితి ఉంది. కరెంటు రాక మొటర్లు నడువక పంటలు ఎండిపోతున్నాయని ఈ నెల 10న బెల్లంపల్లి మండల రైతులు బెల్లంపల్లిలోని సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. త్రీఫేజ్‌ కరెంటు ఇవ్వక పోతే తీవ్రంగా నష్టపోతామని పేర్కొన్నారు.

వర్షపాతం సాధారణమే..

ఈ వానాకాలంలో జిల్లాలో సాధారణ వర్షపాతమే నమోదైంది. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు 951.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్‌లో లోటు నెల కొనగా ఆ తర్వాత సాధారణ వర్షపాతం ఉంది. గత సంవత్సరం సీజన్‌ ఆఖరులో మంచి వర్షాలు కురిశాయి. అక్టోబరు, నవం బరు మాసాల్లో సైతం వానలు దంచి కొట్టాయి. కాని ఈ సంవత్సరం అం దుకు బిన్నమైన వాతావరణం ఉంది. వర్షాలు లేక పోగా ఎండలు మం డిపోతున్నాయి. నైరుతి రుతు పవనాలు వెనుదిరిగిపోగా, ఈశాన్య రుతు పనాల ప్రభావం కానరావడం లేదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితి రైతుల ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Updated Date - Oct 11 , 2026 | 11:35 PM