Share News

ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:06 PM

ఉపాధి హామీలో పనిచేస్తున్న కూ లీలకు పని ప్రదేశాల్లో తగిన సౌకర్యాలు కల్పించాలని జిల్లా అదనపు కలె క్టర్‌ చంద్రయ్య పేర్కొన్నారు శనివారం మండలంలోని కుందారం, కి ష్టాపూర్‌ గ్రామాలను జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావుతో కలి సి సందర్శించారు.

ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి

అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

జైపూర్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీలో పనిచేస్తున్న కూ లీలకు పని ప్రదేశాల్లో తగిన సౌకర్యాలు కల్పించాలని జిల్లా అదనపు కలె క్టర్‌ చంద్రయ్య పేర్కొన్నారు శనివారం మండలంలోని కుందారం, కి ష్టాపూర్‌ గ్రామాలను జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావుతో కలి సి సందర్శించారు. గ్రామాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల పురోగతిని పరిశీలించి లబ్దిదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇం దిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, గృహ జ్యోతి, రైతు భరోసా, గ్యాస్‌ సబ్సిడీ, రుణ మాఫీ, ఉచిత రేషన్‌ పంపిణీ, ఉపాధి హామీ పనుల తీరును, కూలీల హా జరు నమోదు, పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రొమ్మిపూర్‌ రె వెన్యూ గ్రామం ప్రధానమంత్రి అనుసూచిత జాతీయ అభ్యుదయ యోజ నలో ఎంపిక కావడంతో గ్రామంలో మౌలిక సదుపాయాల అవసరాలను పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు, రిజిష్ట ర్‌లు పరిశీలించారు. గ్రామంలో 99 రోజుల ప్రణాళికలో జరుగుతున్న పా రిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ చందుపట్ల పాపిరెడ్డి, కిష్టాపూర్‌ సర్పంచు దుర్గం మహేష్‌, కుందారం సర్పంచు వినోదకిష్టయ్య, ఎంపీడీవో సత్యనారా యణ, ఎంపీవో శ్రీపతి బాపురావు, ఏపీవో బాలయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 11:06 PM