Share News

ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి

ABN , Publish Date - Mar 17 , 2026 | 11:08 PM

వికసిత్‌ భారత్‌- గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ (వీబీజీ రామ్‌ జీ) ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశాల్లో కనీస వసతు లు కల్పించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు గుంపల్లి అశోక్‌ ప్రభుత్వాని డిమాండ్‌ చేశారు.

ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి
లింగసానిపల్లిలో కూలీలతో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు గుంపల్లి అశోక్‌

- సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు గుంపల్లి అశోక్‌

బిజినేపల్లి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : వికసిత్‌ భారత్‌- గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ (వీబీజీ రామ్‌ జీ) ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశాల్లో కనీస వసతు లు కల్పించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు గుంపల్లి అశోక్‌ ప్రభుత్వాని డిమాండ్‌ చేశారు. మండలంలోని లింగసానిపల్లి, వెంకటాపూర్‌ గ్రా మాల్లో పని చేస్తున్న కూలీలతో మంగళవారం మాట్లాడారు. రెండు నెలలుగా కూలీ డబ్బులు రాకపోవడంతో ఉగాది పండగకు పస్తులు ఉం డాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.307 ఇవ్వాలని ప్రక టించినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పని ప్రదేశాల్లో నీడ కోసం టెంట్‌, తాగునీటి సౌకర్యం, ప్రథమ చికిత్స కోసం అవసరమైన మెడికల్‌ కిట్లు ఏర్పాటు చేయకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు శ్రీశైలం, మహేష్‌, వెంకటమ్మ, నాగేష్‌, రాము లు, పర్వతాలు, కూలీలు ఉన్నారు.

ఫ ఉప్పునుంతల, (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించి ఈబీ జీరాంజీ బిల్లును రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింతల నాగరాజు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కంసానిపల్లి గ్రామంలో ఉపాధిహామీ కూలీలతో మాట్లా డారు. కూలీల సమస్యలు అడిగి తెలుకున్నారు. కార్యక్రమంలో కూలీలు చెన్నయ్య, రామచంద్రం, లక్ష్మయ్య, ఇందిరమ్మ, సైదమ్మ ఉన్నారు.

ఫ కల్వకుర్తి, (ఆంధ్రజ్యోతి) : ఉపాధిహామీ కూలీలకు పెండింగ్‌లో ఉన్న డబ్బులు వెంటనే చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చింత ఆంజనేయులు, సభ్యులు బీ. ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. మంగళవారం మండల పరిధిలోని రఘుపతిపేట, లింగసానిపల్లి, సుద్దకల్‌ గ్రామాలలో నాయకులు పర్యటించి ఉపాధిహామీ కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా గౌరవ అధ్యక్షుడు జగన్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 11:08 PM