Share News

పరీక్షా కేంద్రంలో వసతులు కల్పించాలి

ABN , Publish Date - Feb 26 , 2026 | 11:44 PM

ఇంటర్‌ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కావాల్సిన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ కమార్‌ దీపక్‌ అధికారులను ఆదేశించారు. గురువారం చెన్నూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, టీ జీఎస్‌డబ్య్లూ, రెసిడెన్షియల్‌ బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు.

పరీక్షా కేంద్రంలో వసతులు కల్పించాలి

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్‌ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కావాల్సిన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ కమార్‌ దీపక్‌ అధికారులను ఆదేశించారు. గురువారం చెన్నూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, టీ జీఎస్‌డబ్య్లూ, రెసిడెన్షియల్‌ బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మార్చి 16 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌ పరీక్షలు ఉంటాయన్నారు. ఇందుకోసం జిల్లా లో 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యా ర్థులకు అవసరమైన తాగునీరు, ఫ్యాన్‌లు తదితర సౌకర్యాలను కల్పించా మన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. పరీక్ష సమయానికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపించాలన్నా రు. అనంతరం చెన్నూరులో కొనసాగుతున్న వంద పడకల ప్రభుత్వ ఆసు పత్రి నిర్మాణ పనులు పరిశీ లించారు. పనులను వేగవంతంగా పూర్తి చే యాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి అంజయ్య, సంబంధిత అధికారులు ఉన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 11:44 PM