Share News

విస్తరణ పనులు త్వరగా చేయకుంటే మున్సిపల్‌ కార్యాలయం ముట్టడిస్తాం

ABN , Publish Date - Aug 03 , 2026 | 10:49 PM

చెన్నూరు పట్టణంలో అంబేద్కర్‌ చౌక్‌ నుంచి పెద్ద చెరువు వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయకుంటే మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పేర్కొన్నారు.

విస్తరణ పనులు త్వరగా చేయకుంటే   మున్సిపల్‌ కార్యాలయం ముట్టడిస్తాం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌

చెన్నూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరు పట్టణంలో అంబేద్కర్‌ చౌక్‌ నుంచి పెద్ద చెరువు వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయకుంటే మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పేర్కొన్నారు. సోమవారం రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమైమూడు నెలలు గడుస్తున్నా ప్రధాన రహదారి ప నులు ఎందుకు ముందుకు సాగడం లేదో చెప్పాలన్నారు. రోడ్డును ఎన్ని ఫీట్ల వెడల్పుతో విస్తరిస్తున్నారు, డ్రైనేజీ, సర్కిళ్లు, లైటింగ్‌ సిస్టం విధానం ఏంటనే అంశాలపై ప్రజలకు పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రోడ్డు కొలతల విషయంలో మంత్రి వివేక్‌వెంకటస్వామి, మున్సి పల్‌ కమిషనర్‌కు సరైన అవగాహనలేదని ప్రజల సమస్యలను మంత్రి, మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. భవనాలు కూల్చివే యడంతో వచ్చిన మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ల యా జమానులకు విక్రయించారని ఆరోపించారు. ప్రధాన రహదారి కావడంతో రోడ్డుపై రాకపోకలు సాగించాలంటే ప్రజలు నానా అవస్థలు పడుతున్నా రని ఆయన అన్నారు. ప్రజలు, వ్యాపారులు అవస్థలు పడుతున్నా అధికా రులు, మంత్రికి కనిపించడం లేదా అని పేర్కొన్నారు. వెంటనే పనులను వేగవంతం చేయాలని లేకుంటే మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెంకటనర్సయ్య, జాడి తిరుపతి, శంకర్‌, మదురాజ్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 10:49 PM