Share News

kumaram bheem asifabad- కో ఆప్షన్‌ పదవులపై కన్ను

ABN , Publish Date - Mar 03 , 2026 | 10:35 PM

మున్సిపాలిటీ ల్లో కోఆప్షన్‌ పదవులపై నాయకులు దృష్టి పెట్టారు. మున్సిపాలిటీ ఎన్నికలు ముగిశాయి. వార్డు సభ్యులు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తయిం ది. ఇక మిగిలింది కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక. ఈ ఎంపికను కూడా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీల్లో పాలక వర్గాలు కొలువు దీరిన నేపథ్యంలో తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం కోఆప్షన్‌ సభ్యులను కూడా నియమించాల్సి ఉంటుంది.

kumaram bheem asifabad- కో ఆప్షన్‌ పదవులపై కన్ను
లోగో

కాగజ్‌నగర్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ ల్లో కోఆప్షన్‌ పదవులపై నాయకులు దృష్టి పెట్టారు. మున్సిపాలిటీ ఎన్నికలు ముగిశాయి. వార్డు సభ్యులు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తయిం ది. ఇక మిగిలింది కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక. ఈ ఎంపికను కూడా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీల్లో పాలక వర్గాలు కొలువు దీరిన నేపథ్యంలో తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం కోఆప్షన్‌ సభ్యులను కూడా నియమించాల్సి ఉంటుంది. ఇందుకు త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ కానున్నది. కౌన్సిలర్‌ సమాన హోదా ఉండటంతో ఆయా పార్టీల నాయకులు వీటిపై దృష్టి సారించారు. మున్సిపాల్టీ ఎన్నికల సందర్భంగా టికెట్‌ రాని మైనార్టీ నేతలు, మహిళ నేతలకు కోఆప్షన్‌ సభ్యులుగా అవకాశం కల్పిస్తామని ఆయా పార్టీల నాయకులు హామీలిచ్చి పోటీ నుంచి విరమించారు. బుజ్జగింపుల ద్వారా వారు తిరుగుబాటు చేయకుండా చేశారు. వీరంతా ఇప్పుడు కోఆప్షన్‌ పదవులుపై దృష్టి సారించారు. పోటీకి సిద్ధపడుతున్నారు. దీని ఈ పదవికి పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపు కొత్త పాలక వర్గం మద్దతు కూడగట్టుకొని ఆప్షన్‌ పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కోఆప్షన్‌ సభ్యుల నియామాకానికి సంబంధించిన షెడ్యూల్‌ నోటిఫికేషన్‌ ఇంకా జారీ కావాల్సి ఉంది. కాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కొందరు, గెలుపుకు సహకరించామని మరి కొందరు కోఆప్షన్‌ పదవులను ఆశిస్తున్నారు. పాలక వర్గాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టడంతో పాటు ముఖ్య నేతల చుట్టు ఆశావహులు ప్రదక్షిణాలు చేస్తున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల కోసం కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో కాంగ్రెస్‌ పార్టీకి బీజేపీ పార్టీ మద్దతు పలుకడం విస్మయ పరిచింది. అనైతిక పొత్తుపై బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీజేపీ పొత్తుపై విరుచకపడ్డారు. అలాగే వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో అనూహ్య ట్విస్ట్‌ ఎదురైంది. కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ రాజేశ్వరి చేతులెత్తక పోవడంతో ఇరువైపులా సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో లాటరీ పద్ధతి ద్వారా బీఆర్‌ఎస్‌కు మద్దతు పలికిన బీజేపీ కౌన్సిలర్‌ డాక్టర్‌ అనిత వైస్‌చైర్మన్‌ సీటు దక్కించుకున్నారు. కాగా కోఆప్షన్‌లో కూడా తీవ్ర పోటీ నెలకొనే అవకాశాలున్నాయని పలువురు నాయకులు చెబుతు న్నారు.

Updated Date - Mar 03 , 2026 | 10:35 PM