బీఆర్ఎస్ పార్టీ విధానాలను ఎండగట్టాలి
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:35 PM
అక్రమ ఆస్తులు కూ డగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల విధానాలను అనునిత్యం ఎండ గట్టాలని, పార్టీ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే నాయకులను ఉపేక్షించే ది లేదని మంత్రి వివేక్ తెలిపారు.
అర్హులైన ఓట్లు తొలగకుండా చూడాలి
మంత్రి వివేక్ వెంకటస్వామి
మందమర్రి టౌన్, అక్టోబర్ 18(ఆంధ్రజ్యోతి) : అక్రమ ఆస్తులు కూ డగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల విధానాలను అనునిత్యం ఎండ గట్టాలని, పార్టీ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే నాయకులను ఉపేక్షించే ది లేదని మంత్రి వివేక్ తెలిపారు. మందమర్రి, రామకృష్ణాపూర్ బీఎల్వోలతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ప్రవేశపెట్టిన విఽధానాలతో 13 వేల కోట్ల ఓట్లు తొలగుతున్నాయని తెలి పారు. ఇటీవల తాను కూడా దీనిపై పోరాటాలు చేస్తున్నట్లు తెలి పా రు. రాష్ట్రంలో విలీనంతో పరిస్ధితులు తారుమారు అవుతున్నాయని, తా ను ఇంట్లో కూడా అవసరం ఉంటే తప్పవిద్యుత్ వాడకం తగ్గించానని, నీటిని కూడా పొదుపుగా వాడాలని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కే సీఆర్ ఫాంహౌజ్‌కు అసైన్డ్ భూములలో బావులు ఏర్పాటు చేసి నీటిని ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఇటీవల కార్మిక సభ ఎందు కోసమో అ న్నారు. బాల్క సుమన్ అక్రమంగా డబ్బులు సంపాదించుకొని ప్రజల కోసం పని చేస్తున్న తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో ఆ పార్టీ విధానాలను అనునిత్యం ఎండ గట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, కౌన్సిలర్లు గుర్రం శ్రీని వాస్, కూతురు ప్రభాకర్, పల్లె రాజు, మందమర్రి నాయకులు, పట్టణ అధ్యక్షుడు ఒడ్నాల శ్రీనివాస్,మంద తిరుమల్‌రెడ్డి పాల్నొన్నారు.