నోష్ ఫార్మా కంపెనీలో పేలుళ్లు
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:12 AM
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో ఉన్న నోష్ ఫార్మా ల్యాబ్‌లో గురువారం పేలుళ్లు సంభవించాయి.
ఇద్దరు కార్మికులకు గాయాలు.. నల్లగొండ జిల్లా చిట్యాలలో ఘటన
చిట్యాలరూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో ఉన్న నోష్ ఫార్మా ల్యాబ్‌లో గురువారం పేలుళ్లు సంభవించాయి. రియాక్టర్ సమీపంలో పేలుళ్లు జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేడంతో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. బల్క్‌డ్రగ్ తయారీలో భాగంగా ల్యాబ్ రెండో బ్లాకులోని యంత్రాల్లో ముడి పదార్థం నింపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి కార్మికులు లక్ష్మణ్‌కుమార్, వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడగా.. వారిని కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్, ఏఎస్సై వెంకటయ్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.