kumaram bheem asifabad- మిషన్ భగీరథ కార్మికుల శ్రమ దోపిడీ
ABN , Publish Date - Aug 11 , 2026 | 10:50 PM
మిషన్ భగీరథ పథకంలో పని చేస్తున్న కార్మికులను ఏజెన్సీలు శ్రమ దోపిడీకి గురికి చేస్తున్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ తెలిపారు. మిషన్ భగీరథ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళ వారం ఆసిపాబాద్ గ్రిడ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఆసిఫాబాద్ రూరల్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): మిషన్ భగీరథ పథకంలో పని చేస్తున్న కార్మికులను ఏజెన్సీలు శ్రమ దోపిడీకి గురికి చేస్తున్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ తెలిపారు. మిషన్ భగీరథ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళ వారం ఆసిపాబాద్ గ్రిడ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలం నుంచి మిషన్ భగీరథ పథకంలో పని చేస్తున్న కార్మికులు ఏజేన్సీలు శ్రమదోపిడీ పాల్పడుతున్నట్టు తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో తాగునీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు అందడంలేదన్నారు. కార్మికులకు ప్రతి నెల వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిబంధన విదించినప్పటికీ కాంట్రాక్టర్లు అవేవి పట్టించు కోవడం లేదని చెప్పారు.. దీంతో కుటుంబాలు గడవక ఆర్థికంగా ఇబ్బందులు పడు తున్నారని తెలిపారు. ఇప్పటికైనా వీరికి న్యాయం చేయాలన్నారు. లేని పక్షం లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆత్మకూరి చిరంజీవి, రాజుగౌడ్, మహేష్, షకీర్, బాలేష్, జంషద్, శివం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.