Share News

ప్రభుత్వ పథకాలను వివరించాలి

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:02 PM

త్వ రలో జరగనున్న మునిసిపల్‌ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అ భ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

ప్రభుత్వ పథకాలను వివరించాలి
కార్యకర్తలతో సమావేశమైన మంత్రి జూపల్లి

- పర్యాటక శాఖ మంత్రి జూపల్లి

- మునిసిపల్‌ ఎన్నికలపై కార్యకర్తలతో సమావేశం

కొల్లాపూర్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : త్వ రలో జరగనున్న మునిసిపల్‌ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అ భ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం కొల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని 14వ వార్డు, 11వ వా ర్డు, 15వ వార్డు, 19వ వార్డులలో మంత్రి విస్తృ తంగా పర్యటించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకు లు, కార్యకర్తలు, వార్డు సభ్యులతో సమావేశం ని ర్వహించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ రా ష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టి రెండు సంవత్సరాల్లోనే అనేక సంక్షేమ పథకాలను అమ లు చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి అభ్యర్థులను భారీ మెజార్టీతో గె లిపించానని అన్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ, మహిళ లకు ఉచిత బస్సు ప్రయాణం, 200యూనిట్లలోపు వారికి ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు రుణ మాఫీ వంటి పథకాలను వివ రించాలని సూచించారు.

ట్రాన్స్‌జెండర్లకు అవకాశం ఇవ్వాలి

త్వరలో జరగబోయే మునిసిపల్‌ ఎన్నికల్లో కో ఆప్షన్‌ సభ్యులుగా తమకు అవకాశం ఇవ్వాలని మంగళవారం కొల్లాపూర్‌ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు నాగర్‌కర్నూల్‌ జిల్లా ట్రాన్స్‌జెండర్లు వినతిప త్రం అందజేశారు. కొల్లాపూర్‌ మునిసిపల్‌ ఎ న్నికల నేపథ్యంలో నియమించే కో ఆప్షన్‌ సభ్యు లలో ఒకరిని ట్రాన్స్‌జెండర్‌లకు అవకాశం కల్పిం చాలని కోరారు. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రేషన్‌ కార్డులు అం దించాలని కోరారు. కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్స్‌ అసోసియేషన్‌ బాధ్యులు శివాని నాయక్‌, జానకి నాయక్‌, దీక్షిత్‌ ఉన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 11:02 PM