Share News

రాష్ట్రాలకు సూత్రబద్ధ కేటాయింపులుండాలి

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:10 AM

కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లలో రాష్ట్రాలకు నిర్దిష్టమైన సూత్రబద్ధ (ఫార్ములా బేస్డ్‌) కేటాయింపులు ఉండాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు...

రాష్ట్రాలకు సూత్రబద్ధ కేటాయింపులుండాలి

  • నిర్దిష్ట ఫార్ములాతో కేంద్ర గ్రాంట్లు ఇవ్వాలి.. 16వ ఆర్థిక సంఘం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి

  • ‘16వ ఆర్థిక సంఘం నివేదిక’పై సదస్సులో వక్తలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లలో రాష్ట్రాలకు నిర్దిష్టమైన సూత్రబద్ధ (ఫార్ములా బేస్డ్‌) కేటాయింపులు ఉండాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల్లో వాటాకు నిర్దిష్ట సూత్రాన్ని అమలు చేస్తున్నప్పటికీ విపత్తు నిర్వహణ కింద ఇచ్చే నిధులు, స్థానిక సంస్థలకు విడుదల చేసే గ్రాంట్లు, రాష్ట్ర ప్రత్యేక గ్రాంట్లు, రంగాలవారీ గ్రాంట్లకు మాత్రం ఎలాంటి ఫార్ములా లేకపోవడంతో కేటాయింపులు అసంబద్ధంగా ఉంటున్నాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి గ్రాంట్లకు కూడా ఒక సూత్రాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ, సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీ్‌స(సెస్‌) సంయుక్త ఆధ్వర్యంలో ‘16వ ఆర్థిక సంఘం నివేదిక’పై బుధవారమిక్కడ విస్తృత స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె.రామకృష్ణారావు, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు, 15వ ఆర్థి క సంఘం సభ్యుడు ఎ.ఎన్‌.ఝా, సెస్‌ డైరెక్టర్‌ రేవతి తదితరులు పాల్గొని మాట్లాడారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాలకు ఒక నిర్దిష్టమైన సూత్రం అమల్లో ఉందని వక్తలు చెప్పారు. 16వ ఆర్థిక సంఘం కూడా 41ు వాటాను సిఫారసు చేసిందని అన్నారు. కానీ, విపత్తు నిర్వహణ, స్థానిక సంస్థలు, రాష్ట్రాల ప్రత్యేక, రంగాలవారీ గ్రాంట్లకు ఎలాంటి నిర్దిష్ట సూత్రాన్నీ 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేయలేద ని తెలిపారు. ఈ గ్రాంట్ల అంశం ఇంకా పరిశీలనలో ఉందని, తుది నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక సంఘం చెబుతోందని వివరించారు. వీటికి కూడా ప్రత్యేక సూత్రాన్ని నిర్దేశించి, దానిప్రకారం రాష్ట్రాలకు గ్రాంట్ల ను విడుదల చేయాలని పేర్కొన్నారు. రెవెన్యూ లోటు ఏర్పడే రాష్ట్రాలకు పరిహారంకింద ఇచ్చిన గ్రాంటును 16వ ఆర్థిక సంఘం పునరుద్ధరించలేదని, దీన్ని రద్దు చేయడం సమంజసం కాదన్నారు.


ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వాలి: రామకృష్ణారావు

రాష్ట్రాలకు ప్రత్యేక, రంగాలవారీగా గ్రాంట్లను ఇవ్వాలని సీఎస్‌ కె.రామకృష్ణారావు అన్నారు. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక గ్రాంట్ల నిబంధనలు ఉండాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై వేతనాలు, సబ్సిడీల భారం పెరిగిందని, 2014లో నెలకు రూ.1500 కోట్లుగా ఉన్న ఉద్యోగుల వేతన భారం.. ఇప్పుడు రూ.6000 కోట్లకు చేరిందన్నారు. దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ.. నిధులను స్వేచ్ఛగా ఖర్చు చేయడం, అప్పులు, నిధుల సమీకరణ వంటి అంశాల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య విభజన రేఖ కనిపిస్తోందని, దీన్ని పరిష్కరించుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ఆ సెస్‌లను నియంత్రించాలి: అహ్లువాలియా

కేంద్రం విధిస్తున్న సెస్‌లకు అడ్డూ అదుపూ ఉండడం లేదని, ఫలితంగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రా ల వాటా తగ్గుతోందని మాంటెక్‌సింగ్‌ అహ్లువాలి యా ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సెస్‌లు, సర్‌చార్జీల విధింపుపై కేంద్రం పునరాలోచించాలన్నారు. ఆర్థిక సంఘాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్రాలకు ప న్నులు పెంచుకునే అధికారం లేకపోవడం ఆందోళనకరమని, స్థానిక సంస్థలు సరైన మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండాల్సిన ఆరోగ్యకర సమాఖ్య పోటీతత్వం కాస్తా ఘర్షణాత్మక సమాఖ్య విధానానికి దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - Feb 26 , 2026 | 03:10 AM