Share News

పునర్విభజనపై ఉత్కంఠ..

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:28 PM

అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు కసరత్తు చే స్తుండడంతో రాజకీయ నాయకుల్లో తీవ్ర ఆసక్తిని రేకిత్తి స్తోంది.

పునర్విభజనపై ఉత్కంఠ..

-జిల్లాలో కొత్తగా మరో నియోజకవర్గం ఏర్పాటయ్యే ఛాన్స్‌

-లక్షెట్టిపేట ఏర్పాటుపై ఆశలు

-కేంద్ర ప్రభుత్వం కసరత్తుతో ఆసక్తి

మంచిర్యాల, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు కసరత్తు చే స్తుండడంతో రాజకీయ నాయకుల్లో తీవ్ర ఆసక్తిని రేకిత్తి స్తోంది. సాధారణంగా ప్రతి 20 ఏళ్లకోసారి అసెంబ్లీ నియో జకవర్గాల పునర్విభజన జరుగుతుంది. చివరిసారిగా 2008 లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్ప ట్లో జిల్లాలో లక్షెట్టిపేట కేంద్రంగా మంచిర్యాల నియోజక వర్గం ఉండేది. 2008 పునర్విభజన తరువాత లక్షెట్టిపేట నుంచి మంచిర్యాలకు నియోజకవర్గ కేంద్రాన్ని మార్పు చే శారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుండడంతో జిల్లాలో కొత్తగా మరో నియోజకవర్గం ఏర్పాటు అవుతుందని నాయకులు బావి స్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉంది. అయితే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో నియోజకవర్గాలను పెంచాలనే ప్రతిపాదన చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఎంపీ పరిధిలో రెం డు కొత్త అసెంబ్లీ స్థానాలను పెంచాలని నిర్ణయించారు. ఈ ప్రకారం జిల్లాకు సంబంధించి మరో కొత్త నియోజకవ ర్గానికి అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో మంచిర్యాల, చెన్నూర్‌, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కొ త్తగా లక్షెట్టిపేట నియోజకవర్గం ఏర్పాటవుతుందనే ప్రచా రం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 2,30,064 మంది జనాభా ఉండాల్సి ఉం డగా, ఆ దమాషా ప్రకారం కొత్త నియోజక వర్గం ఏర్పా టయ్యే అవకాశాలు ఉన్నాయి.

లక్షెట్టిపేటకే ప్రాధాన్యం...

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు చేసిన పక్షంలో లక్షెట్టిపేటకే అవ కాశాలు ఎక్కువ ఉంటాయనే చర్చ సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో లక్షెట్టిపేట కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం ఉండేది. దాంతో పాటు చెన్నూర్‌, బెల్లంపల్లి నియోజకవర్గా లు ఉండేవి లక్షెట్టిపేట నియోజకవర్గంలో మంచిర్యాల జి ల్లా కేంద్రం ప్రధాన పట్టణంగా ఉండడం, ఇక్కడ రైలు, రోడ్డు మార్గాల సౌకర్యం అధికంగా ఉండడంతో మంచిర్యాల కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే ప్ర తిపాదనలు ఉండేవి. వీటి ఆధారంగా నియోజకవర్గ కేం ద్రంగా ఉన్న లక్షెట్టిపేటను అప్పట్లో మంచిర్యాలకు మార్చా రు. ప్రస్తుతం మంచిర్యాల కేంద్రంగా అసెంబ్లీ నియోజ కవర్గం ఉండగా పాత కేంద్రమైన లక్షెట్టిపేటను మరో కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉన్నా యి. లక్షెట్టిపేటను నియోజకవర్గంగా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాలను అం దులో విలీనం చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుండ డంతో లక్షెట్టిపేటకు ప్రాధాన్యం ఇస్తే జిల్లాలో మొత్తంగా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. ఇదిలా ఉండగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి జన్నా రం మండలం ప్రస్తుతం ఖానాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది. కొత్తగా లక్షెట్టిపేట కేంద్రంగా ప్రత్యేక ని యోజకవర్గం ఏర్పాటైతే జన్నారం మండలాన్ని కూడ అం దులో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయి.

రిజర్వేషన్లలోనూ మార్పులకు అవకాశం...

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ప్రస్తు తం ఉన్న రిజర్వేషన్లలోనూ మార్పులు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం జనరల్‌ కేటగిరిలో ఉండగా చెన్నూర్‌, బె ల్లంపల్లి, నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వేషన్‌ పరిధిలో ఉన్నా యి. కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గం కారణంగా ఆయా రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మం చిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం బీసీ జనరల్‌గా మారు తుందనే ప్రచారం జరుగుతుండగా లక్షెట్టిపేట సైతం జనర ల్‌ విభాగంలోనే ఉండే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆశావహుల్లో టెన్షన్‌....

కొత్తగా అసెంబ్లీ స్థానం పెరిగే అవకాశం ఉండటం, రిజ ర్వేషన్లలో మార్పులు జరుగుతాయనే ప్రచారంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. దీంతో పాటు మహిళ రిజర్వే షన్లు సైతం కేంద్రం ప్రకటించిన విధంగా 33 శాతం అమ లు చేస్తే పెనుమార్పులకు అవకాశాలు ఉన్నాయి. మంచి ర్యాల నియోజకవర్గాన్ని జనరల్‌ మహిళకు రిజర్వు చేస్తార నే మరో ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే జరిగితే పోటీ లో నిలబడే మహిళలు ఎవరనే చర్చా కూడ జరుగుతోం ది. మంచిర్యాల, చెన్నూర్‌ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు మహిళల ప్రాతినిధ్యం లేదు. బెల్లంపల్లి నియోజక వర్గంలో మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హయాంలో టీడీపీ తరుపున అమరాజుల శ్రీదేవి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు ఆ తరువాత కూడ పురుషులే అక్కడ ఎ మ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక వేళ మంచి ర్యాలను జనరల్‌ మహిళకు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం బావిస్తున్న ప్రకారం మహిళలకు పెద్దపీట వేసినట్లు అవు తోంది. అలాగే కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గం రిజర్వే షన్లపైనా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జిల్లాలో రెం డు ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గాలు ఉండగా కొత్తగా ఏర్పా టయ్యేది జనరల్‌ కేటగిరికి రిజర్వు అవుతుందనే బావనలో ప్రధాన పార్టీల నాయకులు ఉన్నారు. బీసీలకు కొత్త ని యోజకవర్గంలో చాన్స్‌ వస్తే బరిలో దిగేందుకు మంచిర్యాల నుంచి దండేపల్లి వరకు నాయకులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. మరో వైపు మందమర్రి కేంద్రంగా మరో నియోజకవర్గం ఏర్పాటు చేస్తారనే ప్రచారం కూడ జరుగుతోంది. క్యాతన్‌పల్లి, మందమర్రి, బొక్కలగుట్ట ప్రాంతాలను కలుపుతూ కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.

Updated Date - Apr 01 , 2026 | 11:29 PM