Share News

kumaram bheem asifabad-అభ్యర్థుల్లో ఉత్కంఠ

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:03 PM

మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కం ఠ నెలకొన్నది. గెలుపు ఓటముల విషయం శుక్రవా రం తేలనుంది. అభ్యర్థులు, పార్టీల భవితవ్యం తేలిపోనుంది. ఎన్నికల్లో చివరి అంకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొన్ని గంటల్లో పూర్తి కానుంది. గతంలో ఎన్నడు లేని విధంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపుపై ప్రతి ఒక్కరి దృష్టి కేంద్రీకృతమైంది.

kumaram bheem asifabad-అభ్యర్థుల్లో ఉత్కంఠ
లోగో

- మున్సిపల్‌ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

- ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌లో కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటు

- గెలుపుపై ఎవరి ధీమా వారిదే

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కం ఠ నెలకొన్నది. గెలుపు ఓటముల విషయం శుక్రవా రం తేలనుంది. అభ్యర్థులు, పార్టీల భవితవ్యం తేలిపోనుంది. ఎన్నికల్లో చివరి అంకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొన్ని గంటల్లో పూర్తి కానుంది. గతంలో ఎన్నడు లేని విధంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపుపై ప్రతి ఒక్కరి దృష్టి కేంద్రీకృతమైంది. జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ ఎన్నికలు హోరహోరీగా కొనసాగాయి. రెండు మున్సి పాలిటీల పరిధిలోని పట్టణ ఓటర్లు బుధవారం పోలింగ్‌ ద్వారా ఇచ్చిన తీర్పు ఎలా ఉంటుందో శుక్రవారం తేటతెల్లం కానుంది. అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తల్లో నెలకొన్న ఎడతెగని ఉత్కంఠకు శుక్రవారం తెరపడనుంది. జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలలో ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓటమి పాలవుతారో ఎవరి విజ య అవకాశాలను ఎవరు దెబ్బతీస్తారో మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవులు ఏ పార్టీని వరిస్తాయే అనే విష యంపై ఆయా పట్టాణాల్లో చర్చ కొనసాగుతోంది.

- కౌంటింగ్‌ ప్రక్రియకు..

మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను సమ ర్థవంతంగా నిర్వహించేందుకు ఉన్నతాధికారు లు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఆసిఫాబాద్‌ మున్సి పల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాన్ని జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళా శాలలో ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రంలో రెండు కౌంటింగ్‌ హాళ్లను ఏర్పాటు చేసి ఒక్కొ కౌంటింగ్‌ హాలులో ఐదు టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రౌండుకు 10 వార్డుల చొప్పున రెండు రౌండ్లలో 20 వార్డుల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తా రు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాన్ని పట్టణంంలోని డీఏవీ పాఠశాలలో ఏర్పా టు చేశారు. కౌంటింగ్‌ కేంద్రంలో మూడు కౌంటింగ్‌ హాళ్లను ఏర్పాటు చేసి ఒక్కొ కౌంటింగ్‌ హలులో ఐదు టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొరౌండుకు 10 వార్డుల చొప్పున మూడు రౌం డ్లలో 30 వార్డుల లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ప్రతీ టేబుల్‌కు ఒక సూపర్‌ వైజర్‌, ఇద్దరు కౌంటింగ్‌ సహాయకులు విధుల్లో పాల్గొనను న్నారు. కౌంటింగ్‌ కేంద్రాలకు సిబ్బంది ఉదయం 6:30 గంటలకే చేరుకోవాలని అధికారులు వారికి ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ టేబుల్‌ వద్ద అభ్యర్థి, అభ్యర్థి తరపున ఏజెంట్లు ఉంటారు. ప్రతీ బ్యాలెట్‌ పేపరును క్షుణ్ణంగా ఏజెంట్ల సమక్షంలో పరిశీలించిన తర్వాతే ఓట్లను లెక్కించనున్నారు.

- ఫలితాలపై ఆసక్తి..

మరికొద్ది గంటల్లో కౌంటింగ్‌ ప్రారంభం కానుండ డంతో జిల్లాలోని రెండు మున్సిపాలిటీల ఫలితాలపై ఆసక్తి పెరుగుతోంది. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ దఫా ఎన్నికలు జరుగగా ఫలితాలపై ఉత్కంఠ కనిపిస్తోంది. కాగజ్‌న గర్‌లో పోలింగ్‌ సరళిని పట్టి పరిశీలిస్తే పోటాపోటీ నెలకొంది. దీంతో రెండు మున్సిపాలిటీల ఫలితాలపై అటు అభ్యర్థుల్లో ఇటు నాయకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలతో పాటు ఇతర పార్టీలు తమ అభ్యర్థులు గెలుపు ఓటములపై లెక్కలు వేసుకుంటున్నారు. ఏ వార్డుల్లో తమకు గెలుపు అవకాశాలు ఉన్నాయి ఏ వార్డుల్లో తమకు ప్రతికూ ల పరిస్థితులు ఉన్నాయో బేరీజు వేసుకుంటున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ పీఠంపై ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహలు రచిస్తున్నారు. కాగా మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపుపై అభ్యర్థులు ఎవరి ధీమా వారిదే వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు కూడ తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపరన్నది మాత్రం బ్యాలెట్‌ బాక్సులు తెరవనిదే తెలియదు. వివిధ సర్వేలు, వివిధ పార్టీల కు మెజార్టీ ఇస్తున్నాయి. దీంతో సర్వేలపై ఆధారప డి గెలుపు ధీమాతో ఉన్నారు.

- క్యాంపునకు తరలిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు..

ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డు ల్లో పోటీ చేసిన అభ్యర్థులు క్యాంపునకు తరలి వెళ్లా రు. బుధవారం ఎన్నికలు జరుగగా శుక్రవారం లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అభ్యర్థులుగా పోటీలో నిలిచిన వారిని బుధవారం రాత్రి హైదరాబాద్‌కు క్యాంపునకు తరలించారు. ఈనెల 16న జరుగనున్న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు నేరుగా వారు రాను న్నట్లు తెలిసింది. 20 వార్డులలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని మున్సిపల్‌ చైర్మన్‌ పదవి దక్కించు కుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

- కౌంటింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు..

మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్‌, కాగజ్‌ నగర్‌ కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను అమలు చేయనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. ఎస్పీ నితికా పంత్‌ ఆధ్వర్యంలో ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది అధ్వర్యంలో కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు చేపట్టనున్నారు.

Updated Date - Feb 12 , 2026 | 11:04 PM