Share News

అధికారులపై దాడులు చేస్తే ఉపేక్షించం

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:33 AM

గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ఎక్సైజ్‌ సిబ్బందిపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అత్యంత సీరియ్‌సగా తీసుకుంటుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

అధికారులపై దాడులు చేస్తే ఉపేక్షించం

  • కానిస్టేబుల్‌పై గంజాయి స్మగ్లర్ల దాడి హేయం: జూపల్లి

హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ఎక్సైజ్‌ సిబ్బందిపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అత్యంత సీరియ్‌సగా తీసుకుంటుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆదివారం ఆరా తీశారు. నిమ్స్‌ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి.. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. విధి నిర్వహణలో గాయపడిన సౌమ్యకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Jan 26 , 2026 | 03:33 AM