ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి భరోసా
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:14 AM
విధి నిర్వహణలో మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చిందని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు...
సోదరుడికి ఉద్యోగ నియామక పత్రం అందజేత
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: మంత్రి జూపల్లి
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చిందని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దాంతో ఆమె సోదరుడు జి.శ్రవణ్‌కు ఎక్సైజ్‌శాఖలోనే జూనియర్ అసిస్టెంట్‌గా నియామక పత్రం అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ద్వారా శ్రవణ్‌కు ఈ నియామక పత్రం అందజేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా అందించింది. సౌమ్యకు పదవీ విరమణ వయసు వచ్చే వరకు పూర్తి జీతభత్యాలను కూడా ఆ కుటుంబానికి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.