మితిమీరిన వేగం ప్రమాదాలకు కారణం
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:28 PM
రహదారులపై మితిమీరిన వేగంతో వాహనా లు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా ఉంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
తాండూర్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : రహదారులపై మితిమీరిన వేగంతో వాహనా లు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా ఉంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం తాండూర్ మండ ల కేంద్రంలో తాండూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రహదారి దబ్రత నిబంధ నల అవగాహణ సదస్సుకు ఎమ్మెల్యే వినోద్, డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాహనదారులు రహదారి భధ్రత నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్ధానాలకు చేరుకోవాలన్నారు. ద్విచక్రవాహనాలు నడిపేవారు హెల్మెట్, కార్లు నడిపేవారు సీటుబెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. రహదారులపై నిర్ధేశిత వేగంతో మాత్రమే వాహనాలను నడపాలన్నారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన అర్హత కలిగిన వారు లైసెన్స్ పొందాలని, వాహనాలకు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను కలిగి ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే సదరు వ్యక్తిలైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 24 వరకు రహదారి భద్రత నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలుతప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని పేర్కొన్నారు. అనంతరం రహదారి భధ్రత ప్రతిజ్ఞ చేశారు. అనంతంర తాండూర్ మండల కేంద్రానికి చెందిన మహిళ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా ఆమె కూతురు స్వాతికి ఎమ్మెల్యే రూ. 10 వేలు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు రూ. 10 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.