Share News

మితిమీరుతున్న అంబులెన్స్‌ డ్రైవర్ల ఆగడాలు..!

ABN , Publish Date - May 22 , 2026 | 10:57 PM

మంచిర్యాల జిల్లాలో ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకులు, డ్రైవర్ల ఆగడాలు రోజు రోజు కూ మితిమీరి పోతున్నాయి. సంపాదన కోసం ఎంతకైనా దిగజా రుతున్నారు. రోగుల ప్రాణాలు పోయినా సరే...తమ జేబులు నిం పుకోవడమే లక్ష్యంగా అందినకాడికి దండుకుంటున్నారు.

మితిమీరుతున్న అంబులెన్స్‌ డ్రైవర్ల ఆగడాలు..!
మంచిర్యాల ఐబీ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు అంబులెన్స్‌లు

-కిరాయి కోసం రోగుల ప్రాణాలతో చెలగాటం

-అడిగినంత ఇవ్వాల్సిందేనని మొండి పట్టు

-ఇతర వాహనాల్లో వెళితే అడ్డుకుంటూ వాగ్వాదం

మంచిర్యాల, మే 22 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లాలో ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకులు, డ్రైవర్ల ఆగడాలు రోజు రోజు కూ మితిమీరి పోతున్నాయి. సంపాదన కోసం ఎంతకైనా దిగజా రుతున్నారు. రోగుల ప్రాణాలు పోయినా సరే...తమ జేబులు నిం పుకోవడమే లక్ష్యంగా అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో వారి ఆగడాలు మరింతగా జఠిలం కాగా...అవసరమైతే భౌతిక దాడులకు కూడా వెనకాడటం లేదు. రోగి దొరికితే చా లు....రక్తం పీల్చే జలగల్లా నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. త మను కాదని ప్రైవేటు వాహనాల్లో వెళితే అడ్డుకుంటూ వాగ్వా దానికి దిగుతున్నారు. ఈ క్రమంలో సమయాతీతం కావడం వల్ల దూర ప్రాంతాలకు రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. తాజాగా ఓ అంబులెన్స్‌ నిర్వాకం వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన రోగి ప్రాణం మీదకు రాగా, తన గిరాకీ చెడగొట్టాడనే అక్కసుతో ఓ యువకుడిపై భౌతికదాడికి పాల్పడ్డ సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

ఇతర వాహనాల్లో వెళ్లారని....

కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన ఎం రఘు అనే వ్యక్తి తన బంధువైన సాలక్క అనే మహిళ ఆనారోగ్యంతో బాధపడు తుండగా మంచిర్యాల జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో చేర్పిం చాడు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌కు తరలించే క్రమంలో ఐబీ చౌరస్తా సమీపంలో ఉన్న ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ను సంప్రదిం చాడు. కిరాయి అధికంగా చెప్పడంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్ప త్రికి తరలించాడు. అక్కడ సైతం చికిత్స అందించేందుకు నిరాక రించడంతో ఈ నెల 19న అర్థరాత్రి తన స్నేహితుడైన ఎండీ స ల్మాన్‌ సహకారంతో ప్రైవేటు వాహనంలో కరీంనగర్‌కు బయ ల్దేరేందుకు సిద్ధపడ్డారు. ఇంతలో సదరు అంబులెన్స్‌ను డ్రైవ ర్‌ వాహనానికి అడ్డుపెట్టి వాగ్వాదానికి దిగాడు. రోగి పరిస్థితి ఆం దోళనకరంగా ఉండటంతో ఎలాగోలా కరీంనగర్‌కు వెళ్లిపోయారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ నిర్వాకంతో సమయాతీతమై రోగి ఆరోగ్యం మ రింత క్షీణించినట్లు బాధితుడు తెలిపాడు. తన గిరాకీ చెడగొ ట్టాడనే నెపంతో అంబులెన్స్‌ డ్రైవర్‌ తన ఓనర్‌ సహాయంతో సల్మాన్‌పై మరికొందరితో కలిసి ఈ నెల 21న రాత్రి భౌతిక దాడికి పాల్పడటంతో గాయాలపాలయ్యాడు. దీంతో బాధితుడు శుక్రవా రం అంబులెన్స్‌ ఓనర్‌ ఎండీ సర్వర్‌, డ్రైవర్‌ అషుతోపాటు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల ఏసీపీకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అడ్డగోలుగా కిరాయి వసూలు...

జిల్లా కేంధ్రంలో ఉన్న పలు అంబులెన్స్‌ల యజమానులు రో గుల కుటుంబీకుల నడ్డీ విరిస్తూ అడ్డగోలుగా కిరాయిలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్‌, వరంగల్‌, హైద్రా బాద్‌ లాంటి ప్రాంతాలకు రోగులను తరలించాలంటే రూ. 10 వేల నుంచి రూ. 30వేల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగు తోంది. అంత మొత్తం ఇచ్చుకోలేమని చెబితే దూషణలకు దిగడం, అవసరమైతే భౌతిక దాడులకు పూనుకోవడం ఇక్కడ సర్వసా ధారణమైంది. మరోవైపు అంబులెన్స్‌ డ్రైవర్లు, యజమానులు క మీషన్ల కోసం రోగులను తమకు నచ్చిన ఆసుపత్రులకు తరలించే ఆనవాయితీ కూడా జిల్లా కేంధ్రంలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 350 వరకు ప్రైవేటు అంబులెన్స్‌లు ఉండగా, ఒక్క జిల్లా కేంధ్రంలోనే 100కుపైగా ఉన్నాయి. వాటి ఓనర్లు, డ్రైవర్లు ప్రైవేటు ఆస్పత్రు లతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని కమీషన్ల దందా కొనసాగి స్తున్నారు. వైద్యులు రెఫర్‌ చేసిన చోటుకు కాకుండా రోగులను డ్రైవర్లు తమకు అనుకూలంగా ఉండే ఆస్పత్రులకు తరలిస్తూ రూ. 30 వేల చొప్పున కమీషన్లు దండుకుంటున్నట్లు తెలుస్తోంది. రోగుల కుటుంబ సభ్యుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా నేరుగా వారికి నచ్చిన ఆస్పత్రుల్లో జాయిన్‌ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే ప్రచారమూ ఉంది.

కమీషన్‌ కోసం చంపేశారు...!

జైపూర్‌ మండలం షెట్‌పల్లికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడగా, కొందరు అంబులెన్స్‌ డ్రెవర్లు కమీషన్ల కోసం ఆస్పత్రుల చుట్టూ తిప్పి కాలయాపన చేయడంతో బ్రెయిన్‌ డెడ్‌ అయి మృతి చెందిన సంఘటన రెండేళ్ల కిత్రం జరిగింది. గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ (35) మంచిర్యాలలోని ఓ పైవ్రేట్‌ హాస్పిటల్లో ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌గా పని చేస్తూ బైక్‌పై ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో మంచిర్యాలలోని ఓ పైవ్రేట్‌ హాస్పిట ల్‌కు తరలించగా ఇక్కడి వైద్యులు కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి రె ఫర్‌ చేశారు. అంబులెన్స్‌లో వెళ్తుండగా మార్గమద్యంలో ఐదుగురు డ్రైవర్లు అంబులెన్స్‌లో ఎక్కి పరిస్థితి సీరియస్‌గా ఉందని, అవయ వదానం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందంటూ కుటుంబ సభ్యు లను ఒప్పించే ప్రయత్నం చేస్తూ అక్కడి కెల్విన్‌ ఆస్పత్రికి తరలిం చేలా పట్టుబట్టారు. అక్కడ స్కానింగ్‌ లేకపోవడంతో మరో చోటు కు తరలించారు. దీంతో శ్రీకాంత్‌ సీరియస్‌ పొజీషన్‌కు వెళ్లాడు. ఆస్పత్రి వైద్యులు హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కు రెఫర్‌ చేశారు. యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్‌కు ఎక్కువ ఖర్చవుతుందని, కామినేని హాస్పిటల్లో తక్కువ ఖర్చుతోనే ట్రీట్‌ మెంట్‌ చేయిస్తామని చెప్పి అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు రెండు రోజుల అనంతరం శ్రీకాంత్‌కు బ్రెయిన్‌ డెడ్‌ అయి మృతి చెంది నట్లు ధృవీకరించారు. దీంతో అక్కడే అవయవదానం చేశారు. మంచిర్యాల వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌లోని భద్రకాళి ఆస్పత్రికి తరలించి ఉంటే సకాలంలో చికిత్స అంది, బతికేవాడన్న అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. కేవలం కమీషన్‌ కోసం కరీంనగర్‌లో ఆస్పత్రుల చుట్టూ తిప్పడమేగాక హైద్రాబాద్‌ వరకు తరలించడంతో శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులకు తీరని నష్టం వాటి ల్లింది. కాగా డ్రైవర్ల ముఠా సభ్యులపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా, జైలుకు కూ డా వెళ్లారు. కాగా ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ ఇచ్చే కమీషన్లకు ఆశపడి రోగుల చావుకు కారణమైన పలు సంఘటనలు జిల్లా కేంద్రంలో ఉన్నాయి.

Updated Date - May 22 , 2026 | 10:57 PM