ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుత ఫలితాలు
ABN , Publish Date - Apr 30 , 2026 | 01:23 AM
పది’ ఫలితాల్లో జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల హవా కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచినట్లు జిల్లా విద్యాధికారి శారద తెలిపారు. జిల్లావ్యాప్తంగా
పెద్దపల్లి కల్చరల్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ‘పది’ ఫలితాల్లో జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల హవా కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచినట్లు జిల్లా విద్యాధికారి శారద తెలిపారు. జిల్లావ్యాప్తంగా 41కేంద్రాల్లో మొత్తం 7488మంది విద్యార్థులు పరీక్ష రాయగా, అందులో 3674మంది బాలురు, 3814మంది బాలికలు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 97.70శాతం ఉత్తీర్ణత నమోదు చేశారని తెలిపారు. ఇక రాష్ట్రస్థాయిలో పెద్దపల్లిజిల్లా 16వ స్థానాన్ని కైవసం చేసుకుందన్నారు. పదవతరగతి ఫలితాల సాధనలో కృసిచేసిన ప్రధానోపాధ్యాయులు, విషయబోధన ఉపాధ్యాయులు, పాఠశాల విద్యాశాఖ సిబ్బందికి జిల్లా విద్యాధికారి ప్రత్యేక అభినందనలు తెలిపారు. జిల్లాలో 81 ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలిచాయి. 10కేజీబీవీ పాఠశాలల్లో 8కేజీవీబీ స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించగా, మోడల్ స్కూల్ పాఠశాలలు 7కు గాను మూడు వందశాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. అలాగే రెసిడెన్షియల్ స్కూళ్లలో నూరుశాతం ఫలితాలు సాధించినట్లు వివరించారు. సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో ఆరు వందశాతం, బీసీ, మైనారిటీ పాఠశాలల్లో నాలుగు పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు. ఈ ఫలితాల్లో బాలికలదే అగ్రస్థానం నిలిచిందని ఆమె పేర్కొన్నారు. అలాగే పెద్దపల్లి జిల్లాలోని జడ్పీ బాలికల ఉన్నతపాఠశాల విద్యార్థిని కాలువ భువనశ్రీ 581మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. మండలంలోని నిట్టూరు జడ్పీపాఠశాల విద్యార్థిని సాగర్ల అక్షర 562మార్కులు, తుర్కలమద్దికుంటకు చెందిన సాత్విక, హర్షిని, హన్మంతునిపేటకు చెందిన హరిణి 552మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. అలాగే బ్రహ్మణపల్లికి చెందిన సిద్దిశ్రీరామ్ 549మార్కులు, పెద్దపల్లి బాయ్స్ హైస్కూల్‌కు చెందిన రాఘవచంద్ర 551 మార్కులు, రాగినేడు జడ్పీస్కూల్ విద్యార్ధిని పడాల శ్రీవెన్నెల 537 మార్కులతో అద్భుత ఫలితాలు సాధించారని జిల్లా విద్యాధికారి శారద పేర్కొన్నారు.
పెద్దపల్లి కల్చరల్ : పట్టణంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు 570 కుమ్మరి మేఘన మాధురి సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మేఘన మాధురిని అభినందించారు. తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వమే కారణమని మాధురి పేర్కొంది.
పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి మండలంలోని నిట్టూరు జిల్లాపరిషత్ పాఠశాలకు చెందిన సాగర్ల అక్షర 562 మార్కులు సాఽధించి పెద్దపల్లి రూరల్ టాపర్‌గా నిలిచింది. హన్మంతునిపేటకు చెందిన హరిణి 552, మారేడుగొండకు చెందిన కౌశికహరి 496, పెద్దబోంకూరుకు చెందిన ఐశ్వర్య 522, రాగినేడుకు చెందిన పడాల శ్రీవెన్నెల 537, రంగాపూర్ కుచెందిన అలీఅజ్గర్501, మూలసాలకు చెందిన అక్షయ571, రాఘవపూర్‌కు చెందిన అక్షయ 538, తుర్కలమద్దికుంటకు చెందిన సాత్విక , శ్రీ హర్షిణి 552, బ్రాహ్మణపల్లికి చెందిన సిద్ధ శ్రీరాం 549, అప్పన్నపేటకు చెందిన అక్షర 541,. కొత్తపల్లికి చెందిన రవళి 529 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌లుగా నిలిచినట్లు మండల విద్యాధికారి సురేంద్రకుమార్ తెలిపారు.
కాల్వశ్రీరాంపూర్ : మండలంలోని ఉన్నతపాఠశాలలు, మోడల్‌స్కూళ్లు, కస్తూర్భా పాఠశాలలకు చెందిన మొత్తం 217 మంది పరీక్షలు రాయగా ఇందులో 214మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ మోడల్‌స్కూల్‌లో చదువుకుంటున్న కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన పిల్లలమర్రి సాయిశివాని571 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. అదే పాఠశాలకు చెందిన ఐలి జ్ఞానిక562 మార్కులతో ద్వితీయస్థానంలో నిలిచింది. ప్రభుత్వపాఠశాల విద్యార్థులు మంచి మార్కులు సాధించడం పట్ల ఎంఈవో సిరిమల్ల మహేష్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అనుముల పోచయ్య తదితరులు అభినందనలు తెలిపారు.
సుల్తానాబాద్ : పదవతరగతి పరీక్ష ఫలితాల్లో సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మోడల్‌స్కూల్ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. కె సాక్షిత్600మార్కులకు గాను 573మార్కులు సాధించాడు. ఎస్ స్రవంతి547, డి శ్రీహిత 544, జి మనస్విని 543, ఎస్ అక్షయ 521 మార్కులు సాధించారు. 400మార్కులు పైబడి మార్కులు సాధించిన వారిలో 53మంది ఉన్నారు. స్కూల్‌లో వందశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ గోల్డీబల్భీర్ కౌర్ తెలిపారు. సుల్తానాబాద్ సేంట్ మేరీ స్కూల్‌కు చెందిన కాంపల్లి మహాలక్ష్మి 567మార్కులు సాధించింది. పూజిత 566, అనిశ్‌కుమార్ 563, విష్ణువర్ధన్ 562, హారిక 559, ఓంకార్ 557, వినీష 556 మార్కులు సాధించారు. - మండలంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో పదవ తరగతి పరీక్షలు రాసిన 42మందికి గాను 42మంది ఉత్తీర్ణత సాధించినట్లు స్పెషల్ ఆఫీసర్ ఎం స్వప్న తెలిపారు. వీరిలో దివ్యశ్రీ556 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో, కె తులసిరాణి 554ద్వితీయ స్థానంలో నిలిచారు. మరో పది మంది విద్యార్థినులు 500కు పైగా మార్కులు సాధించారు. - మండలంలోని ప్రభుత్వపాఠశాలల విద్యార్థులు పదవతరగతి పరీక్షలలో ప్రభంజనం సృష్టించారని ఎంఈవో ఆరేపల్లి రాజయ్య తెలిపారు. మండలంలోని పాఠశాలలో మొత్తం 570మంది విద్యార్థులు(300 బాలురు, 270 బాలికలు) పరీక్షలు రాశారని వారిలో 557మంది విద్యార్థులు (291 బాలురు, 266బాలికలు) ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. సుల్తానాబాద్ జడ్పీబాలుర హైస్కూల్‌కు చెందిన డి సరివల్లిక అనేబాలిక 585 మార్కులు సాధించి ప్రథమస్థానంలో నిలిచిందని, మహాత్మాజ్యోతిరావు ఫూలే బాలికల స్కూల్‌కు చెందిన ఏ జశ్విత575మార్కులతో ద్వితీయ స్థానం సాధించారని, గర్రెపల్లి మోడల్ స్కూల్‌కు చెందిన కె సాక్షిత్573 మార్కులతో తృతీయ స్థానం పొందారని ఎంఈవో తెలిపారు. 12పాఠశాలలలో వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
అంతర్గాం : రామగుండం మోడల్‌స్కూల్‌లో వందమంది విద్యార్థులు పరీక్షలు రాయగా వందశాతం ఉత్తీర్ణతశాతం సాధించారు. అత్యధికంగా జస్వంత్577, మనోరశ్మిత576, వైష్ణవి573, అఖిల్570 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. అలాగే 550కు పైగా 12మంది విద్యార్థులు, 500ల మార్కులకు పైగా విద్యార్థులు సాధించడం విశేషం. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను అభినందించారు.
కమాన్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో రికార్డుస్థాయి విజయాలు
కమాన్‌పూర్ : మండలంలోని ప్రభుత్వపాఠశాలల్లో పదవ తరగతి ఫలితాలు ఈ ఏడాది అద్భుతంగా వచ్చాయని మండల విద్యాధికారి విజయ్‌కుమార్ పేర్కొన్నారు. 500లకు పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య ఏడుగురికి చేరడంపై ఆయన అభినందనలు తెలిపారు. తాజా ఫలితాల్లో అంజుమ్ సుల్తానా561 మార్కులతో మొదటి స్థానంలో ఉండగా అక్షయ553 ద్వితీయస్థానం, సాహితి548 మార్కులతో తృతీయస్థానం పొందారన్నారు. మిగతా విద్యార్థులు మనోజ్543, శరణ్య 527, చైతన్య506, అక్షిత503 మార్కులతో టాపర్‌గా నిలిచారన్నారు. విద్యార్థుల కృషితోపాటు ఉపాధ్యాయుల నిబద్దత, తల్లిదండ్రుల తోడ్పాటు ఈ విజయానికి కారణమని ఆయన అన్నారు.
ముత్తారం : మండలంలోని ప్రభుత్వపాఠశాలల్లో 94శాతం ఉత్తీర్ణత నమోదయింది. దరియాపూర్ మోడల్‌స్కూల్ నుంచి సీహెచ్ మాధురి539, పోతారంపాఠశాల నుంచి ఈ అజయ్‌కుమార్ 525, కస్తూరిబాపాఠశాల నుంచి పి రేష్మ 524మార్కులు సాధించారు. లక్కారం, పోతారం జడ్పీహెచ్‌ఎస్, సరస్వతి పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఎంఈవో హరిప్రసాద్, ప్రధానోపధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందించారు.
రామగిరి : మండలంలోని పన్నూరు గ్రామంలోని కస్తూర్బా పాఠశాలకు చెందిన వినీలా 585/600 మార్కులు సాదించి మండల టాపర్‌గా నిలిచింది. అలాగే బేగంపేట్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన పూర్ణచందర్ 554/600మార్కులు సాదించి రెండవ స్థానం, జడ్పీహెచ్ సుందిల్లా పాఠశాలకు చెందిన పూజా530 మార్కులు సాధించి మూడోస్థానాల్లో నిలిచారు. కస్తూర్బాలో వందశాతం పాస్ అయ్యారు. ప్రగతి, వాణి, కృష్ణవేణి టాలెంట్‌పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఆయా పాఠశాలల యాజమాన్యం అభినందించింది.
ధర్మారం : మండలం 99.3శాతం ఉత్తీర్ణత సాధించింది. మేడారం బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న యు.అలేఖ్య 585 మార్కులు సాధించి మండల టాఫర్‌గా నిలిచింది. 570మార్కులు సాధించి మల్లాపూర్ బాలికల గురుకుల విద్యార్థి సంధ్యప్రీతి సాధించింది. పత్తిపాక ఉన్నత పాఠశాల విద్యార్థిని భైరి మనస్విని 570మార్కులు సాధించి నాలుగో స్థానంలో నిలువగా, ప్రభుత్వపాఠశాల విభాగంలో బైరి మనస్వినిది మొదటిస్థానం. మండలంలోని పెరుకపల్లి, మల్లాపూర్, పత్తిపాక, కటికెనపల్లి, కొత్తూర్, దొంగతుర్తి, నర్సింహులపల్లి, రచ్చపల్లి ఉన్నత పాఠశాలలు, మండలకేంద్రంలోని ఆదర్శపాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మండల విద్యాధికారి పి.ప్రభాకర్‌తో పాటు వివిద పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభినందించారు.
మండలంలో పదవ తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత
ఎలిగేడు, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): మండలంలో వందశాతం ఉత్తీర్ణత సాధించారని మండల విద్యాధికారి అనసూరి నరేంద్రచారి తెలిపారు. సుల్తాన్‌పూర్‌కు చెందిన దండవేని శ్రీలేఖ538 మార్కులతో ప్రథమస్థానం, ఆడేపు అనిరుద్ 523 మార్కులతో ద్వితీయస్థానంతో మండల టాపర్లుగా నిలవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దూళికట్టకు చెందిన ఎర్ర నందిని 514 మార్కులతో తృతీయస్థానం, ఎలిగేడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన తాటికొండ కీర్తన514, బోగే వెంకట తేజ485మార్కులు సాధించడం ప్రభుత్వ పాఠశాలల పనితీరుకు నిదర్శనమన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 99 శాతం ఉత్త్తీర్ణత
- ఏడు హైస్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత
- మండల టాపర్ గా నిలిచిన పొత్కపల్లి హైస్కూల్ విద్యార్థి
ఓదెల, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పొత్కపల్లి హైస్కూల్ విద్యార్థి రాసాల మేఘన583 మార్కులు సాధించి, మండల టాపర్‌గా నిలిచింది. ఉడత శ్రీవళ్లి 579మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలువగ,కనగర్తి దాసరి పద్మ, హనుమయ్య హైస్కూల్ విద్యార్థి ఆర్.కళ్యాణి 572 మార్కులు పొంది మండలంలో తృతీయ స్థానంలో ఉత్తీర్ణత సాధించింది. మండలంలోని ఓదెల, పొత్కపల్లి,మోడల్ హైస్కూల్, కేజీవీబీ,జెడ్పిహెచ్‌ఎస్,కనగర్తి దాసరి హనుమయ్య హైస్కూల్, ఓదెల జెడ్పిహెచ్‌ఎస్,కొలనూర్, గుంపుల హైస్కూల్‌లో వందశాతం ఉత్తీర్ణులయ్యారు.
పాలకుర్తి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): మండలం పరిఽధిలో యూనిర్సల్ పాఠశాల విద్యార్థిని పానుగంటి తేజశ్రీ589 మార్కులు పొంది స్టేట్ 9వ ర్యాంకు సాధీంచింది. కన్నాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని టి సాయి వర్షిత 563మార్కులు సాధించి మండలంలో మెదటి స్థానం కైవసం చేసుకుంది. జయ్యారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని డి అనుహ్య 559 మార్కులు పొంది మండలంలో ద్వితీయస్థానం దక్కించుకుంది.
మంథని: మండలంలోని 14 ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో 151మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. స్థానిక కృష్ణవేణి హైస్కూల్ పాఠశాలకు చెందిన అశ్వీష్వర్ 580, పూజశ్రీ 578, తదితరులు అత్యధిక మార్కులు సాధించారు.