మోడల్‌స్కూల్‌లో ‘ఎక్సలెన్స్’ శిక్షణ
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:27 AM
క్లాట్, ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు తెలంగాణ మోడల్‌స్కూళ్లలోని ఇంటర్ విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘ఎక్సలెన్స్’ పేరిట శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. యంగ్ ఇండియా
జగిత్యాల, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): క్లాట్, ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు తెలంగాణ మోడల్‌స్కూళ్లలోని ఇంటర్ విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘ఎక్సలెన్స్’ పేరిట శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ (వైఐఐవోఈ) పేరిట ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో వైఐఐవోఈకి 29 స్కూళ్లను ఎంపిక చేశారు. జగిత్యాల జిల్లా నుంచి మేడిపల్లి మండల కేంద్రంలోని మోడల్‌స్కూల్‌ను ఎక్స్‌లెన్స్ శిక్షణకు ఎంపిక చేశారు.
ఫజిల్లాలో 13 మోడల్‌స్కూల్స్..
జిల్లా వ్యాప్తంగా 13 మోడల్‌స్కూల్స్ ఉన్నాయి. ఇందులో మేడిపల్లి మోడల్‌స్కూల్‌ను యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 స్కూల్స్ ఎంపిక కాగా 9 స్కూల్స్ కామర్స్ విద్యార్థుల కోసం, మిగిలిన 20 స్కూళ్లను సైన్స్ విద్యార్థుల కోసం ఎంపిక చేశారు. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)కు మేడిపల్లి మోడల్‌స్కూల్‌ను ఎంపిక చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించే క్లాట్‌కు కామర్స్ విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ప్రత్యేక అధ్యాపకుల నియామకం, స్టడీ మెటీరియల్ తెప్పించడం ఇప్పటికే పూర్తి చేశారు.
ఫగంటల ప్రతిపాదికన బోధన...
వైఐఐవోఈ శిక్షణ కేంద్రాల్లో విద్యార్థులకు బోధించేందుకు ప్రత్యేకంగా అధ్యాపకులను నియమించనున్నారు. వీరికి గంటల ప్రతిపాదికన డబ్బులు చెల్లించనున్నారు. విద్యార్థులకు శిక్షణతో పాటు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను అందించనున్నారు. ఒక్కో శిక్షణ కేంద్రానికి రూ.13,77,600 చొప్పున బడ్జెట్ కేటాయించారు. అందులో రూ.11,85,600 అధ్యాపకుల పారితోషికానికి, రూ.1,92,000 స్టడీ మెటీరియల్‌కు కేటాయించనున్నారు.
గొప్ప అవకాశం
-మౌనిక, సీఈసీ సెకండ్ ఇయర్, టీజీఎంఎస్, మేడిపల్లి
యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు మా మోడల్ స్కూల్ ఎంపిక కావడం మాకు గొప్ప అవకాశం. గ్రామీణ ప్రాంత విద్యార్థులమైన మాకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడనుంది. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు మమ్మల్ని సిద్ధం చేస్తుంది.
అదృష్టంగా భావిస్తున్నాం
-మధుప్రియ, సీఈసీ సెకండ్ ఇయర్, టీజీఎంఎస్, మేడిపల్లి
ఎక్సలెన్స్ శిక్షణకు మా స్కూల్ ఎంపిక కావడం మా అదృష్టం. మా స్కూల్‌లోని విద్యార్థులకు క్లాట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇది భవిష్యత్తులో ఉపయోగపడనుంది.
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
-నాగ సుధారాణి, టీజీఎంఎస్ ప్రిన్సిపాల్, మేడిపల్లి
ఎక్స్‌లెన్స్ శిక్షణకు మా స్కూల్ ఎంపిక కావడం చాలా గర్వంగా ఉంది. మా స్కూల్‌లోని ఇంటర్ విద్యార్థులకు క్లాట్ వంటి పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులు శిక్షణను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి.