Share News

kumaram bheem asifabad- కేజీబీవీల్లో ఎక్సలెన్స్‌ కోచింగ్‌

ABN , Publish Date - Jul 23 , 2026 | 10:37 PM

కసూ ర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్ధిను లను ఆరో తరగతి నుంచే నీట్‌, జేఈఈ, ఎఫ్‌సెట్‌, క్లాట్‌ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయనున్నారు. యంగ్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్‌ ్స(వైఐఐఏఈ)లుగా మార్చినందున వాటిలో ఇంటర్‌ ప్రవేశానికి పరీక్ష నిర్వహించారు

kumaram bheem asifabad- కేజీబీవీల్లో ఎక్సలెన్స్‌ కోచింగ్‌
లోగో

- ప్రతిభ ఆధారంగా విద్యార్థినుల ఎంపిక

జైనూర్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కసూ ర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్ధిను లను ఆరో తరగతి నుంచే నీట్‌, జేఈఈ, ఎఫ్‌సెట్‌, క్లాట్‌ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయనున్నారు. యంగ్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్‌ ్స(వైఐఐఏఈ)లుగా మార్చినందున వాటిలో ఇంటర్‌ ప్రవేశానికి పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 15 కేజీబీవీ లు ఉన్నాయి. కాగా జిల్లాకు మూడు చొప్పున కేజీబీవీల్లో చేరిన విద్యార్థులకు జేఈఈ మెయిన్‌, నీట్‌, క్లాట్‌, ఎప్‌సెట్‌ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు ఆసిఫా బాద్‌, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి) కేజీబీవీలను అధికారుల ఎంపిక చేశారు.

- ప్రవేశానికి 208 మంది..

కాగా వైఐఐఏఈల్లో ఆరో తరగతిలో ప్రవే శానికి 208 మంది ఐదో తరగతి పూర్తి చేసుకున్న బాలికలు పరీక్షకు హాజరయ్యారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థినులను ఎంపిక చేశారు. ప్రతీ తరగతి గదిలో 20 మంది విద్యార్థినులు మాత్రమే ఉండేలా బ్యాచ్‌లుగా విభజించారు. బోధన కోసం అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా నియమించ నున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారం భించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు లేదా మూడు రోజుల్లో తరగతులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆసిఫాబాద్‌ కేజీబీవీ బైపీసీలో నీట్‌, సిర్పూర్‌(టి) కేజీబీవీ సీఈసీలో క్లాట్‌, కాగజ్‌నగర్‌ కేజీబీవీ ఎంపీసీ లో జేఈఈ మెయిన్స్‌ (ఐఐటీ) ప్రవేశ పరీక్ష కోసం ఆరో తరగతి నుంచే సన్నాహాలు చేస్తున్నారు.

పోటీ పరీక్షలకు సిద్ధం చేయడమే ధ్యేయం..

- సచ్చిదానందచారి, డీఈవో

పేద, గ్రామీణ ప్రాంతాల బాలికలు కూడా పోటీ పరీక్షలకు సిద్ధం చేయడమే ధ్యేయం. ఆరో తరగతి నుంచే పూనాది వేస్తే, పదో తరగతి, ఇంటర్‌, నాటికి వారు పోటీ పరీక్ష లకు నిర్భయంగా హాజరవుతారు. నిబంధన ల మేరకు చర్యలు తీసుకుంటున్నాం.

ప్రతిభను వెలికి తీసే అవకాశం..

- భారతి, సెక్టోరల్‌ అధికారి

కేజీబీవీలో చదువుతున్న బాలికల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇది ఒక సువ ర్ణ ఆవకాశం. ప్రత్యేక ఉపాధ్యాయులు ఉండడంతో ప్రతీ విద్యార్థినిపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టగలం. తల్లిదండ్రులు పిల్లలు సద్విని యోగం చేసుకునేలా ప్రోత్సహించాలి.

Updated Date - Jul 23 , 2026 | 10:37 PM